గూగుల్ లో వ్యక్తిగత వివరాలు ఏమి లేకుండా ఉండాలంటే… ఇలా చెయ్యండి..!

Ads

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్ని ఈజీ అయిపోయాయి. అన్నింటినీ మనం ఈజీగా చూసుకోవచ్చు ఏదైనా కావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా సులభంగా మనం ఇంటర్నెట్ ని ఉపయోగించి మన పనుల్ని పూర్తి చేసుకోవచ్చు. చాలామంది ఈరోజు ఆన్లైన్ షాపింగ్ ని ఎక్కువగా చేస్తున్నారు బయటకు వెళ్లి కొనడం మానేశారు. క్రెడిట్ కార్డులు ఆఫర్లు చూసుకుని నచ్చినప్పుడు షాపింగ్ చేస్తున్నారు.

అయితే ఒకసారి మనం ఏదైనా కావాలని వెతికినప్పుడు ఆ తర్వాత మళ్లీ మనం ఇంకో పని చేసుకునేటప్పుడు పదే పదే మనం వెతికినవి కనబడుతూ ఉంటాయి ఏదైనా వస్తువుని కొనాలని మనం ఓపెన్ చేసి చూసినప్పుడు మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసినప్పుడు పదేపదే మనకి ఆ వస్తువు కనబడుతూ ఉంటుంది.

చాలాసార్లు మీరు కూడా దీనిని గమనించి ఉంటారు. మనం సెర్చ్ చేసిన హిస్టరీ ఇన్ఫర్మేషన్ వాళ్లకి తెలిసిపోతుంది అయితే అలా మనం సెర్చ్ చేసిన సమాచారం ఇతరులకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి..? అనేది ఇప్పుడు చూద్దాం.. గూగుల్ ని ఉపయోగించడం పూర్తి సురక్షితం.

సెక్యూర్ గానే ఉంటుంది. అయితే గూగుల్లో మీరు సెర్చ్ చేసే ప్రతి ఒక్క విషయం కూడా రికార్డ్ అవుతుంది. దీని ఆధారంగానే అందరి బ్రౌజింగ్ చరిత్రను ఆయా సంస్థలు క్లియర్ గా తెలుసుకుంటూ ఉంటాయి వాటికి సంబంధించిన అడ్వటైజ్మెంట్ లో మీకు కనబడుతూ ఉంటాయి.

మనం సెర్చ్ చేసేవాటిని ఇలా తొలగించవచ్చు:

గూగుల్లో ఏం వెతికినా, ఏం చేసినా రికార్డు అవుతుంది. అది సిస్టం అయినా ఫోన్ అయినా “మై యాక్టివిటీ” ని సేకరిచేస్తుంది.
ఇక వాటిని మీరు డిలీట్ చెయ్యాలంటే మై ఆక్టివిటీ ను ఓపెన్ చేసి యాక్టివిటీ (my activity) లింక్ పైన క్లిక్ చెయ్యండి. ఇప్పుడు వేరే విండో ఓపెన్ అవుతుంది.
ఈ విండో పై భాగంలో సెర్చ్ బాక్స్ ఉంటుంది.
ఇలా వెతికిన వెబ్సైట్ల వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. డిలీట్ కూడా చేసుకోవచ్చు.
లేదంటే మీరు తేదీల వారీగా బ్రౌజింగ్ హిస్టరీని తీసేయచ్చు. సమాచారాన్ని ఒకేసారి డిలీట్ చేయడం కూడా అవుతుంది.

Ads

యూట్యూబ్ లో వాటిని ఇలా తీసేయచ్చు:

యూట్యూబ్లో సెర్చ్ చేసే వాటి ఇన్ఫర్మేషన్ ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది. దీన్ని కూడా డిలీట్ చేయొచ్చు.
యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ ని క్లిక్ చేసాక ఎడమ వైపున “హిస్టరీ”ట్యాబ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ, క్లియర్ వాచ్ హిస్టరీ మీకు కనిపిస్తాయి. కావాలంటే మీరు డిలీట్ చేయాలని అనుకునే సమాచారాన్ని మాత్రమే డిలీట్ చేయొచ్చు.

అడ్వర్టైజ్మెంట్లు:

మానం ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ చేసినా కూడా ఆ సమాచారాన్ని గూగుల్ తెలుసుకుంటుంది. పైగా ఇతర సంస్థలకు అమెజాన్ వంటి వాటికి సమాచారాన్ని అందిస్తుంది.
ప్రకటనల సంస్థలు మీ సమాచారాన్ని చూడకుండా చెయ్యాలంటే… గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి “పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవసీ” విభాగంలోకి వెళ్ళండి.

యాడ్స్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసి.. మేనేజ్ యాడ్స్ సెట్టింగ్స్ అనే దాన్ని ఎంచుకోవాలి.
“యాడ్స్ పర్సనలైజేషన్” మీద నొక్కండి. దీన్ని డీ యాక్టివేట్ చేయాలి. అప్పుడు యాడ్స్ రావు.

గూగుల్ మ్యాప్స్:

దీన్ని కూడా డిలీట్ చెయ్యచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే గూగుల్ మ్యాప్స్లో టైం లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. అయితే ట్రావెల్ చేసే ప్లేసెస్ ని ఇందులో రికార్డు చేస్తుంది.
గూగుల్ మ్యాప్స్ టైం లైన్ ని మీరు ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చు.
లొకేషన్ ట్రాకింగ్ ని కూడా ఆపేయచ్చు.
వేస్ట్ బాస్కెట్ బటన్ మీద నొక్కితే డిలీట్ అయిపోతుంది.

Previous articleగుమ్మానికి ఎందుకు నిమ్మకాయలని, మిరపకాయలని కట్టాలి..? కారణం ఏమిటి అంటే..?
Next articleవామ్మో వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. మీరు చూసారా…?