చిన్న చిన్న తాళంకప్పలకి ఎందుకు కింద రంధ్రాలు ఉంటాయి..?

Ads

బయటికి వెళ్ళినప్పుడు మనం తాళం కప్పని వేసి లోపలికి వచ్చినప్పుడు తీసి వస్తూ ఉంటాం ఇదే మన పని. కానీ తాళం కప్ప కి చిన్నచిన్న రంధ్రాలు ఉంటాయని చాలా మంది గమనించరు తాళం వేశామా తీశామా అని చూస్తూ ఉంటారు. కొన్ని కొన్ని వస్తువులని ఎందుకు అలా తయారు చేసారో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

మనకి తెలియని చాలా చిన్న చిన్న విషయాలను మనం తెలుసుకోలేకపోతూ ఉంటాము. ఎవరైనా చెప్తే వామ్మో దీని వెనక ఇంత పెద్ద కారణము ఉందా అని ఆశ్చర్యపోతూ ఉంటాము, ఇక తాళం విషయానికి వస్తే.. చిన్న చిన్న తాళం కప్పలకి తాళం వేసే రంధ్రం కాకుండా పక్కన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒక సారి మీరు ఎప్పుడు గమనించక పోతే ఈసారి చూడండి.

Ads

బాగా చిన్న చిన్న తాళం కప్పలకి చిన్న రంధ్రాలని ఇస్తూ ఉంటారు. అవి తాళం కప్ప కింద ఉంటాయి. ఎందుకు ఈ చిన్న రంధ్రము ఉంటుంది..? దీని వల్ల ఉపయోగం ఏదైనా ఉందా లేక పోతే మామూలుగా డిజైన్ లాగ చేశారా అనేది చూస్తే… ఊరికే ఏమి ఈ రంధ్రాలను ఉంచలేదు. ఇవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి అదేంటంటే ఈ రంధ్రాలని డ్రైన్ హోల్స్ అని అంటారు.

 

తాళం కప్పకి తుప్పు పట్టకుండా ఇవి హెల్ప్ అవుతాయి. లోపలికి నీళ్లు వెళ్ళిపోకుండా లోపల నీరు నిల్వ ఉండకుండా ఈ రంధ్రాలు చూస్తాయి. లోపల నీళ్లు ఉండిపోకుండా ఈ రంధ్రాల ద్వారా నీళ్లు బయటకి వచ్చేస్తాయి. అందుకని ఈ రంధ్రాలని తాళం కప్పలకి పెట్టారు.

ఇది పక్కన పెడితే ఒక్కో సారి తాళాలు సరిగ్గా పని చేయవు. ఒక్కొక్క సారి తాళం కప్పలు సరిగ్గా పట్టవు. ఈ సమస్య ఉంటే ఇంజన్ ఆయిల్ లేదంటే ఏదైనా ఆయిల్ ని వెయ్యండి. అప్పుడు తాళం బాగా పని చేస్తుంది. నూనె డ్రైన్ హోల్ నుండి బయటకి వచ్చేయకుండా ఒక్క క్షణం ఆయిల్ ఉండేలా చూసుకోండి. అప్పుడు తాళం పట్టేయకుండా ఉంటుంది.

Previous articleఆ హీరోకి బైక్ నడపడం రాదు… ఈ హీరో ఏమో టెక్నాలజీలో వీక్.. ఎవరో తెలుసా..?
Next articleఐపీఎల్ జట్లు ఎలా సంపాదిస్తాయి..? ఎక్కడ నుండి అన్ని కోట్లు వస్తాయి..?