ఆ హీరోకి బైక్ నడపడం రాదు… ఈ హీరో ఏమో టెక్నాలజీలో వీక్.. ఎవరో తెలుసా..?

Ads

నటన వచ్చి అదృష్టం కలిసి వస్తే ఇండస్ట్రీలో అవకాశాలు వాటంతట అవే వస్తూ ఉంటాయి మంచి నటులకి ఎప్పుడూ కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. చాలా మంది నటులు పెద్దగా చదువుకోలేదు. టెన్త్, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్లు కూడా పెద్ద పెద్ద నటులు అయిపోయారు. హీరోలు అయినంత మాత్రాన అన్ని రావాలని రూల్ కూడా లేదు.

అయితే కొంత మందికి కొన్ని రావు కొని నేర్చుకోవడానికి కొంత మంది ఆసక్తి చూపించరు. బైక్ నడపడం ఈ రోజుల్లో అందరికీ వస్తోంది. చిన్న చిన్న పిల్లలు కూడా బైక్ నడిపిస్తున్నారు. సార్వసాధారణంగా హీరోలందరికీ బైక్ నడపడం వచ్చు అని సినిమాల్లో స్టంట్ లు వంటివి చూసి హీరోలు ఒక రేంజ్ లో బండిని నడుపుతారని మనం భావిస్తూ ఉంటాం.

Ads

నిజానికి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రానా కి బండి నడపడం రాదు ఈ విషయాన్ని రానా ఏ స్వయంగా కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. బైక్ లతో కనెక్షన్ లేదని ఎప్పుడూ బండి నడపలేదని తనకి నడపడం కూడా రాదు అని రానా చెప్పారు. బైక్ నడిపే వాళ్ళంటే తనకి చాలా ఇష్టం అని కూడా రానా చెప్పుకొచ్చారు.

ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ పెట్టడం, ఫోన్ పే చేయడం నేచురల్ స్టార్ నాని కి రావి. అసలు నానికి ఫోన్ పే ఉపయోగించడమే రాదని నాని చెప్పారు. టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనేది నానికి తెలియదని నాని చెప్పారు.టెక్నికల్లీ నాని హ్యాండీక్యాప్డ్ అని ఫోన్ పే గూగుల్, గూగుల్ పే వంటివి ఉపయోగించడం తనకి రాదని ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా నానికి రాదని దసరా ప్రమోషన్ అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు నాని. బ్యాంకు పనులు కూడా నానికి చేసుకోవడం తెలియదట.

Previous articleమేకప్ లేకుండా ఈ 14 హీరోలు ఎలా ఉంటారో మీకు తెలుసా..?
Next articleచిన్న చిన్న తాళంకప్పలకి ఎందుకు కింద రంధ్రాలు ఉంటాయి..?