Ads
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా మ్యాప్ ఉంటుంది. మ్యాప్ ద్వారా మనం ప్రాంతాలని ఈజీగా గుర్తించడానికి అవుతుంది. పైగా మ్యాప్ ల ద్వారా మనం చాలా విషయాలను సులభంగా అర్థం చేసుకోగలం. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా పటం అనేది ఉంటుంది. మన ఇండియా కి ఉన్నట్టుగానే అన్ని దేశాలని కూడా మ్యాప్ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు ఈ విషయాన్ని గమనించారా..?
మన ఇండియా మ్యాప్ లో శ్రీలంక కూడా ఉంటుంది. ఎందుకు ఇండియా మ్యాప్ లో శ్రీలంక ఉండాలి..? అది మన దేశం కాదు కదా..? పాకిస్తాన్, చైనా సరిహద్దు దేశాలైన మన దేశ పటంలో వుండవు.
మరి శ్రీలంక ఎందుకు ఉండాలనేది ఇప్పుడు చూద్దాం. మన దేశ పటం కిందన శ్రీలంక ఉంటుంది. నిజానికి శ్రీలంక మన దేశ పటంలో కచ్చితంగా ఉండాలి. ఒకవేళ కనుక శ్రీలంక ని మన దేశ పటంలో ఉంచకపోతే అది చట్టపరమైన నేరం.
ఈ చట్టాన్ని ఎలా తీసుకొచ్చారనేది చూస్తే.. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యూఎన్సీఎల్ఓసీ-1) కాన్ఫరెన్స్‌ను మొదటి సారి 1956 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. 1958 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. యూఎన్సీఎల్ఓసీ-1లో ఈ విషయం పైన ఏకాభిప్రాయం తీసుకోగా.. 1982 వరకు మూడు సదస్సులు జరుపగా సముద్రానికి సంబంధించి చట్టం వచ్చింది.
Ads
ద లా ఆఫ్ ద సి అంటే ఏమిటి..?
”ద లాఫ్ ద సి” కింద ఇండియా మ్యాప్ లో శ్రీలంక ఉండి తీరాలి. ఐక్యరాజ్యసమితి ఈ చట్టాన్ని తీసుకురావడానికి చొరవ తీసుకుంది. ”ద లా ఆఫ్ ద సి” ప్రకారం దేశ సరిహద్దు సముద్రానికి ఆనుకుని ఉంటే.. బోర్డర్ నుండి 370 కిలో మీటర్లని ఆ దేశం యొక్క సముద్ర ప్రాంతం కింద లెక్క లోకి వస్తుంది. బేస్ లైన్ నుండి 200 నాటికల్ మైళ్ల దూరంలో వుండే ప్రదేశాలని అనగా ఆ దేశపు బేస్ లైన్ ని కచ్చితంగా ఇండియా మ్యాప్ లో చూపించాలి.
ఇది తప్పనిసరి కనుక ఏదైనా దేశం సముద్ర తీరంలో వున్నా లేదంటే కొంచెం భాగం వున్నా కానీ ఆ దేశ సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతంని కూడా చూపాలి. శ్రీలంక మన దేశానికి ఇక్కడ చెప్పినట్టుగా ఉంటుంది. ఇండియా లో ధనుష్కోడికి శ్రీలంక 18 మైళ్ల దూరం లో మాత్రమే వుంది. అందుకే ద లా ఆఫ్ ద సి ప్రకారం భారతదేశ పటంలో శ్రీలంకని చూపించాలి. అందుకే మన మ్యాప్ లో శ్రీలంక ఉంటుంది.