Ads
మనుషుల మధ్య వైరం ఉండటం అనేది సాధారణ విషయం. శతృత్వం అనేది వారి మాటలను బట్టి లేదా ప్రవర్తన కారణంగా ఏర్పడుతుంది. అయితే జంతువుల మధ్యన శత్రుత్వం ఉంటుంది. ముఖ్యంగా పాము, ముంగిసలు శత్రువులు అనే విషయం తెలిసిందే.
Ads
ఈ రెండు ఎప్పుడు ఎదురుపడినా భీకరమైన యుద్దం జరుగుతుంది. ఈ రెండింటి మధ్యన జరిగే ఫైట్ గురించి చిన్నతనం నుండే చాలాసార్లు వినే ఉంటాం. ఇంకా నెమలి – పాము, ఎలుక – పిల్లి మధ్య కూడా శత్రుత్వం ఉంటుంది. అలాగే పాము, ముంగిస మధ్య శత్రుత్వం ఉంది. ఇది శతాబ్దాలుగా కొనసాగుతొంది. అయితే వీటి మధ్య శతృత్వం అనేది ప్రకృతి ద్వారా సృష్టించబడింది. అయితే పాము, ముంగిసల పోరు చూసినపుడు ఈ రెండింటి మధ్య శత్రుత్వం ఎందుకు అనే అని అందరికి అనిపిస్తుంది. అలాంటి సమయంలో పాము, ముంగిసల మధ్య శత్రుత్వం ఎందుకు అనేదాని గురించి ఆన్ లైన్ లో వెతుకుతూ ఉంటారు. అలా వెతికినపుడు రక రకాల సమాధానాలు అందుబాటులో ఉన్నాయి.
నిజానికి పాము, ముంగిస మధ్య శత్రుత్వం ఏమిటి అంటే, పాము ముంగూస్ పిల్లలను ఎప్పుడూ వేటాడుతుంది, ఎందుకంటే దానికి ఈ ఆహారం చాలా ఇష్టమట. ఇక ఈ కారణంతోనే తన పిల్లలను కాపాడుకోవడం కోసం ముంగిస పాముని చూసిన వెంటనే దాడి చేస్తుంది. ముప్పు తిప్పలు పెట్టి, పామును చంపిన తరువాత కానీ ముంగిస అక్కడ నుండి వెళ్ళదు. అయితే ఈ ఫైట్ లో పాము తనను తాను కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ క్రమంలో కాటేసి చంపాలని కూడా చూస్తుంది. ముంగిసకు మాత్రం ఏమీ కాదు.
పాములు కాటేసినా ముంగిసలు ఎందుకు చనిపోవు?
పాము విషం ముంగిస పై ప్రభావం చూపదని అపోహ చాలా మందిలో ఉంది. కానీ అది నిజం కాదు. ముంగిస శరీరం మీద ఉండే ఎసిటైల్కోలిన్ గ్రాహకాలు పాము విడుదల చేసే ఆల్ఫా-న్యూరోటాక్సిన్‌ను అపుతాయి. దాంతో పాము కాటేసినపుడు ముంగిసకు ఏమీ కాదు. అయితే పాము పదే పదే కాటు వేస్తూ ఎక్కువ మోతాదులో విషాన్ని ముంగిస శరీరం పై వదిలితే మాత్రం ముంగిస కూడా చనిపోక తప్పదు. ముంగిస ఎక్కువ సార్లు కాటు వేసే ఛాన్స్ ను పాములకు ఇవ్వకుండా, చాలా వేగంతో కదులుతూ కాటు నుండి తప్పించుకుని, తెలివిగా ఫైట్ చేస్తుంది.
Also Read: రాజులని ఆకర్షించేందుకు రాణీలు వారి అందాన్ని ఇలా పెంచుకునేవారని.. మీకు తెలుసా..?