Ads
ఎప్పుడైనా మీరు దీన్ని గమనించారా కొత్త బ్యాగులు, కొత్త ఎలెక్ట్రానిక్ సమన్లు, కొత్త షూ లు లేదంటే మందులు వంటి వాటిలో చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి. ఈ ప్యాకెట్లు తెల్లటి రంగులో ఉంటాయి. ఈ ప్యాకెట్లను ఇప్పి చూస్తే చిన్న పలుకులు ఉంటాయి. అయితే ఇంతకీ ఈ ప్యాకెట్ ఏమిటి..? ఎందుకు కొత్త సామాన్లలో వీటిని పెడతారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఏదైనా కొత్త సామాన్ల ని కొని తెచ్చుకున్నప్పుడు కానీ ఆర్డర్ చేసినప్పుడు కానీ మనకి ఈ తెల్లటి ప్యాకెట్లు కనబడుతూ ఉంటాయి.
అసలు ఈ ప్యాకెట్లను ఎందుకు ఉంచుతారు..? దీని వలన ఏం లాభం..? ఎటువంటి లాభం లేదు అని అనుకుంటే పొరపాటే.
Ads
ఈ ప్యాకెట్లను ఉంచడానికి పెద్ద కారణమే ఉంది. ఈ ప్యాకెట్లని ఎందుకు ఉంచుతారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న ప్యాకెట్లలో సిలికా జెల్ బాల్స్ ఉంటాయి. అయితే ఈ సిలికా జెల్ అనేది గాలిలో ఉండే తేమని గ్రహించే శక్తి కలిగి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ సిలికా జల్ ని ప్రొడక్ట్స్ లో ఉంచితే తడి లేకుండా చూస్తుంది. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ తడి ఉండడం వలన పాడైపోతూ ఉంటాయి. అందుకని వీటిని ప్రొడక్ట్స్ లో ఉంచుతారు దీంతో తడి లేకుండా ఉంటాయి.
ఏదైనా ప్రోడక్ట్ ని తయారు చేసినప్పటి నుంచి వినియోగదారుడు దానిని తీసే వరకు బాక్స్ లలో ఉంచాల్సి వస్తుంది. అటువంటప్పుడు బాక్సెస్ లో దీర్ఘకాలం ఉంచడం వలన గాలిలో తేమ వలన అవి పాడైపోతూ ఉంటాయి. బ్యాక్టీరియా కూడా అందులో చేరొచ్చు. బ్యాడ్ స్మెల్ కూడా కలగొచ్చు. దీనితో ప్రోడక్ట్ పాడవుతుంది లేదంటే ఆ ప్రోడక్ట్ వినియోగదారుడికి నచ్చకపోవచ్చు. ఇలాంటి సమస్యలు ఏమి కలగకుండా ఉండేందుకు కంపెనీలు ఈ సిలికా జెల్ ని పెడతారు దీనితో ఎలాంటి తడి ఉండదు. ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి. బ్యాడ్ స్మెల్ వంటి ఇబ్బందులు కూడా రావు.