ఘరానా మొగుడు – ఛత్రపతి సినిమాల్లో ఈ రెండు సీన్లు గమనించారా.? భలే మోసం చేసారుగా.?

Ads

మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. చిరంజీవి సినిమాల్లోకి వచ్చి తన నటనతో అందరిని ఆకట్టుకుని ఈ స్థాయికి వచ్చారు. చాలామంది ఇప్పటి హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వస్తున్నారు. చిరంజీవి 150 కి పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి సినిమాల్లో ఘరానా మొగుడు కూడా ఒకటి. 1992లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నగ్మా నటించారు. కే రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 10 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది.

chatrapati movie music copy

ఇది ఇలా ఉంటె..ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా ఛత్రపతి. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ. సడన్ గా ఘరానా మొగుడు నుండి ఛత్రపతికి టాపిక్ మారింది ఏంటి అనుకుంటున్నారా.? ఈ రెండిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏంటి అంటే ఘరానా మొగుడులో ఉన్న ఒక మ్యూజిక్…ఛత్రపతిలో కూడా ఉంటుంది.

Ads

చాలాసార్లు పాత హిట్ మూవీ పాటలను కొత్త సినిమాల్లో రీమేక్ చేయడం చూస్తుంటాం…కొన్ని ట్యూన్స్ ను కూడా అక్కడక్కడా వాడటం గమనిస్తాం. అయితే రెండు సూపర్ హిట్ సినిమాలకు ఒకేలాంటి మ్యూజిక్ వాడారు ఆ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన వ్యక్తి.  ఛత్రపతిలో బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత హైలైట్ అయిందో అందరికి తెలిసిందే. అదే మ్యూజిక్ అంతకంటే ముందే ఘరానా మొగుడు సినిమాలో కూడా వాడారు. ఈ రెండు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే…ఎం.ఎం.కీరవాణి.

Music Director MM Keeravani Latest Photos

2005లో రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా విడుదలైన సూపర్ డూపర్ హిట్ చిత్రం ఛత్రపతి. ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలలో మ్యూజిక్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. అలాంటి మూవీలోని మ్యూజిక్ వేరే సినిమా నుంచి కాపీ కొట్టారు….ఈ మూవీలో ప్రభాస్ వచ్చేటప్పుడు వెనుక వచ్చే మ్యూజిక్ ఒకప్పటి చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంలో చిరుకి నగ్మా కి మధ్య జరిగే ఒక సీన్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడడం జరిగింది.

తమాషా అయిన విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నది ఒకే వ్యక్తి అతనే ది గ్రేట్ ఆస్కార్ విన్నర్ కీరవాణి.

Previous articleపుష్ప 2 లో ఐటెం సాంగ్ కి ఆమె మాత్రం వద్దు అంటున్న బన్నీ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
Next articleఈ చిన్న ప్యాకెట్స్ ని షూ వంటి వాటిలో ఎందుకు పెడతారు..? ఇంత పెద్ద రీజన్ ఉందని మీకు తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.