చర్చి, మసీదులలో లేని ఈ ఫీజ్.. మన దేవాలయాలలో మాత్రం ఎందుకు పెడుతున్నారు?

Ads

సనాతన భారత దేశంలో హిందువుల సంఖ్య ఇతర మతస్తులతో పోలిస్తే చాలా ఎక్కువ. అయినప్పటికీ అన్ని మతాల వారు సర్వ హక్కులతో సుఖంగా ఉండగలిగే దేశం పేరు ఏది? అన్న ప్రశ్న వస్తే అందుకు సమాధానంగా భారతదేశం మొదటి వరుసలో ఉంటుంది. హిందువులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇతర మతాలపై వారి డామినేషన్ మచ్చుకైనా కనిపించదు. భిన్నత్వంలో ఏకత్వం అన్నదాన్ని పాటిస్తూ అందరు సంతోషంగానే ఉండేవారు. కానీ, మారుతున్న పరిస్థితులలో హిందువులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి.

church masjid temple

ఇతర మతస్తుల డామినేషన్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ కథనం ముఖ్య ఉద్దేశ్యంగా మతముల గురించి కాదు. కానీ, ఏ ఇతర మతస్తులకు లేని రూల్స్ హిందువులకు మాత్రం ఎందుకు పెడుతున్నారు? అన్నది చర్చించాల్సిన విషయమే. ఉదాహరణకి, ఏ చర్చికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా చెప్పులు బయట విడిచి లోపలకి వెళ్లిపోవచ్చు. కానీ, హిందువుల దేవాలయానికి వెళ్లాలంటే మాత్రం పార్కింగ్ లో ఫీజు కట్టాలి, అక్కడ నుంచి వచ్చి గుడి బయట చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఫీజు కట్టాల్సిందే.

Ads

church masjid temple

దూర ప్రాంతాల నుంచి వస్తే దేవాలయంలో బస చేయడానికి రుసుము చెల్లించాలి. ఇన్ని చెల్లింపులు అయ్యాక, దర్శనం అయినా చేసుకొనిస్తారా అంటే.. దానికి కూడా ఓ రేటు ఫిక్స్ అయ్యి ఉంటుంది. సర్వ దర్శనం ఉచితమే అయినా.. ఎప్పటికి బయటపడతామో చెప్పలేం. రుసుముల పేరిట క్యూ లైన్స్ పెట్టి, ఒక్కో లైన్ కి ఒక్కో రకమైన ధర చెబుతారు. వాటిని దాటుకుని దర్శనం చేయాలంటే దేవుడే దిగి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇతర చర్చి, మసీదు లాంటి వాటిల్లో ఈ పార్కింగ్ ఫీజ్ లు ఏవీ ఉండవు. ఒక్క దేవాలయాల్లో మాత్రమే ఈ దందా కనిపిస్తుంది.

యాదగిరి గుట్ట, చిలుకూరు, సంఘీ, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, శ్రీశైల మల్లికార్జున స్వామి వారి గుడి, తిరుమల, మంగళగిరి నరసింహ స్వామి గుడి.. ఇలా చెప్పుకోదగ్గ స్వయంభువు దేవాలయాలన్నిటి వద్ద ఈ పార్కింగ్ ఫీజు కచ్చితంగా కట్టాల్సిందే. దీనిపై ప్రశ్నించే వారు ఎవరూ ఉండరు. ఒకవేళ ప్రశ్నించినా పలుకుబడితో ఉండే ప్రముఖులే వారి నోళ్లు మూయించేస్తూ ఉంటారు.

Previous articleహిందూ వివాహ చట్టం ప్రకారం…కేవలం ఇలాంటి కారణాలకే విడాకులు మంజూరు చేస్తారు అంట.?
Next articleHungry Cheetah – OG Glimpse… పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.