విమానాల్లో ప్రయాణించే ఇద్దరు పైలట్స్ ఎందుకు ఒకే రకమైన ఆహారం తినరు ?

Ads

కాస్త ధర ఎక్కువైనా సరే విమానాల్లో ప్రయాణం చేయడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సమయాన్ని ఆదా చేసుకోవడానికి కూడా అవుతుంది. అందుకని చాలా మంది ఫ్లైట్ లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అసలు ప్రయాణం చేసినట్లు కూడా అనిపించదు. ఫ్లైట్ లకి సంబంధించి చాలా విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. వాటిలో ఇది కూడా ఒకటి.

విమానం లోని కాక్ పిట్ లో ఉండే పైలట్లు ఎప్పుడూ ఇద్దరూ కూడా ఒకే రకమైన ఆహారాన్ని తినరు. దీని వెనుక కారణం ఏమిటో మీకు తెలుసా..? మరి ఇప్పుడే తెలుసుకుందాం…

ఈ మధ్యన జరిగిన ఒక సంఘటన గురించి మీరు వినే ఉంటారు. హోలీ పండుగ నాడు ఒక సంఘటన జరిగింది. ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన పైలెట్లు కాక్ పిట్ లో ఆహారం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీంతో విచారణ చేపట్టారు. పైలెట్లను రోజువారి విధుల నుండి తొలగించారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త బాగా స్ప్రెడ్ అయింది. దీంతో చాలా మందిలో ఈ సందేహం ఉండిపోయింది. కొన్ని విమానయాన సంస్థలు కాక్ పిట్ లో ఆహారం తినడానికి అనుమతి ఇస్తారు.

Ads

కానీ కొన్ని సంస్థలు ఒప్పుకోవు. ఇద్దరు పైలట్లు ఆహారం తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఒకేసారి తీసుకోవడానికి ఒప్పుకోరు. కాక్ పిట్ లో ఉండే ఇద్దరు పైలట్లు ఒకేసారి ఆహారం తీసుకోకూడదు అనే రూల్ ఉంది. అయితే పైలట్లు ఒకే ఫుడ్ ని తీసుకోరు. ఈ విషయంలో ఎలాంటి రూల్స్ లేవు కానీ ఒకే ఫుడ్ ని తీసుకోరు. ఇద్దరు ఒకే ఆహారాన్ని తింటే తీసుకున్న ఫుడ్ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే విమానం అదుపు తప్పే అవకాశం ఉంది. అందుకే సేమ్ ఫుడ్ ని తీసుకోరు.

వేరు వేరు ఆహార పదార్థాలు తింటారు. ప్రతి పైలెట్ కూడా దీన్ని పాటిస్తారు. ఒకవేళ ఇద్దరు ఒకే ఫుడ్ ని తీసుకుంటామని అంటే విమాన సిబ్బంది తిరస్కరించే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే ఇద్దరమూ తింటాము అని చెప్పినట్లయితే లిమిట్ గా తీసుకోమని కూడా చెప్తారు. ఈ కారణంగానే పైలెట్లు సేమ్ ఫుడ్ ని తీసుకోరు.

 

Previous articleసింహాసనం సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ అంత పెద్ద రిస్క్ చేసారని తెలుసా ? తేడా వచ్చి ఉంటే ఇంకోలా జీవితం అయ్యేది !
Next articleశతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ పేర్ల వెనుక ఉన్న స్టోరీ ఏంటి ? ఎలా వచ్చాయి ?