మంగళవారం నాడు జుట్టు, గోళ్లు ఎందుకు కత్తిరించకూడదు..? దాని వెనుక ఇంత పెద్ద కారణం ఉందని తెలుసా…?

Ads

మన పెద్దలు కొన్ని కండిషన్స్ ని పెడుతూ ఉంటారు. మనం వాటిని చాలా మటుకు అనుసరిస్తున్నా కూడా మనకి ఎందుకు ఆ రూల్ పెట్టారు దాని వెనుక కారణమేంటి అని అనుకుంటూ ఉంటాము. అయితే పెద్ద వాళ్ళు పెట్టన రూల్స్ వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా..? లేదా..? ఊరికే చెప్పేసారా అని కూడా మనం అనుకుంటూ ఉంటాము. హిందూ సంప్రదాయం ప్రకారం మంగళవారం నాడు ఏ శుభకార్యాలు కూడా చేయరు. అంతేకాక పురుషులు జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్లరు.

గోళ్ళని కూడా మంగళవారం పూట కట్ చేయకూడదని చెప్తూ ఉంటారు. దీని వెనక కారణం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. తరచూ మన పెద్దలు మనకి ఈ విషయాన్ని చెప్తారు. మంగళవారం, శుక్రవారం గోళ్లు కట్ చేసుకోకూడదని..

Ads

జుట్టు కత్తిరించుకోకూడదని అంటారు. మంగళవారం నాడు అంగారక గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంగారక గ్రహాన్ని మంగళ గ్రహ అని అంటారు. ఎక్కువగా మంగళవారం నాడు ఈ గ్రహ ప్రభావం ఉంటుంది. ఎరుపు రంగు కి ఇది చిహ్నం. అధిక వేడి కలిగి ఉంటుంది. ఈ గ్రహం మానవ శరీరం పై దీని ప్రభావం బాగా ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా రక్తాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఆ రోజు శరీరం పై గాయాలు అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గాట్లు పడే ప్రమాదం ఉంది. అందువల్లనే ఆ రోజు కటింగ్ చేసుకోకూడదని అంటారు.

గోర్లని కూడా అందుకే కట్ చేసుకోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. గోళ్ళని కత్తిరించుకోవడం కానీ గడ్డం గీయించుకోవడం లేదంటే జుట్టు కత్తిరించుకోవడం వంటివి తప్పు. మంగళవారం నాడు చాలా బార్బర్లు కొట్టును మూసేస్తూ ఉంటారు. మంగళవారం నాడు జుట్టు కత్తిరించకపోవడానికి గోళ్లను తీయకపోవడానికి కారణం ఇదే. ఈ మధ్యకాలంలో సమయం ఎప్పుడు ఉంటే అప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ నిజానికి అలా చేయడం తప్పు మంగళవారం నాడు ఇలాంటి పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు.

Previous articleరాహుల్ గాంధీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు
Next articleఇవి ఫ్రిడ్జ్ లో పెడితే ఇక విషం కన్నా ప్రమాదం… తెలుసా..?