Ads
పుట్టుక మొదలు చావు వరకు ప్రతిదీ కూడా సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. పుట్టిన వెంటనే పేరు ఎప్పుడు పెట్టాలి. ఏ నెలలో ఏం చేయాలి ఇటువంటివన్నీ కూడా మన పూర్వీకులు పాటించే పద్ధతుల్లోనే మనం పాటిస్తూ ఉంటాము. అలానే ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా మన పూర్వీకులు పాటించే పద్ధతినే మనం పాటిస్తూ ఉంటాము.
అంత్యక్రియలు కూడా పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్తారో పూర్వం నుండి ఎలాంటి ఆచారాలను మనం ఫాలో అవుతున్నామో ఆ విధంగానే అంత్యక్రియలను కూడా జరుపుతారు. హిందువుల సంప్రదాయం ప్రకారం చాలా ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. చాలా మంది వాటిని తప్పక పాటిస్తూ ఉంటారు. ఎవరైనా మనిషి చనిపోతే హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
అంత్యక్రియల విషయంలో కూడా కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని తప్పక పాటించాలి. అయితే ప్రాంతాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి ఆచార సంప్రదాయాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో కొన్ని చెడుగా భావిస్తే కొన్ని ప్రాంతాల్లో అవి మంచిగా భావించొచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే అంత్యక్రియలు జరిపిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలని అంటూ ఉంటారు.
Ads
ఎందుకు అలా వెనక్కి తిరిగి చూడకుండా రావాలి..? దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం… అంత్యక్రియలను పద్ధతి ప్రకారం చేస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని పెద్దలంటారు అంత్యక్రియలు చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అంతిమ సంస్కారాలు మొదలు ఎన్నో గరుడ పురాణంలో వున్నాయి.
గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే అంత్యక్రియలు నుండి తిరిగి వచ్చినపుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ ఎవరైతే చూస్తారో వారితో ప్రేమలో పడుతుంది. తాను చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మాత్రమే విచారంగా ఉన్నాడని ఆత్మ అనుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆత్మ శాంతిని పొందదు. ఆ వ్యక్తితో అనుబంధాన్ని బాగా పెంచుకుంటుంది వాళ్ళ ఇంటికి కూడా వచ్చేయాలని అనుకుంటుంది అందుకే వెనక్కి తిరిగి చూడకూడదు అంత్యక్రియలు తర్వాత చూడకుండా వచ్చేయాలి.