Ads
టోవినో థామస్. ఈ వ్యక్తి పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఇతను డైరెక్ట్ తెలుగు సినిమా ఇప్పటి వరకు చేయలేదు. డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో. తెలుగు హీరోలతో సమానంగా ఇతనికి అభిమానులు ఉంటారు.
లాక్ డౌన్ సమయంలో కొన్ని మలయాళం సినిమాలు తెలుగులోకి విడుదల చేశారు. అందులో సగం పైన సినిమాలు ఇతనివే ఉన్నాయి. దాంతో ఇతను తెలుగు వాళ్ళకి చాలా దగ్గర అయ్యారు. అయితే ఇప్పుడు టోవినో థామస్ నటించిన మరొక మలయాళం సినిమా విడుదల అయ్యింది.
ఆ సినిమా పేరు అన్వేషిప్పిన్ కండతుమ్. ఈ సినిమా ఇప్పుడు మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఆనంద్ నారాయణ్ (టోవినో థామస్) ఒక సబ్ ఇన్స్పెక్టర్. అతను పని చేస్తున్న స్టేషన్ పరిధిలో ఒక అమ్మాయి మిస్ అయిన కేసు ఒకటి నమోదు అవుతుంది. వాళ్లందరినీ ఆనంద్ తన బృందంతో కలిసి పట్టుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆనంద్ బృందం అంతా కూడా సస్పెండ్ అవుతుంది.
వాళ్లందరూ ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత కొంత కాలానికి ఎస్పీ (సిద్ధిఖీ) ఆనంద్ ని, అతని బృందాన్ని పిలిచి శ్రీదేవి (ఆర్తన బిను) అనే అమ్మాయి కేస్ ని అప్పగిస్తాడు. లోకల్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ ఎంత కష్టపడినా కూడా ఈ కేస్ ని పరిష్కరించలేక పోతారు. దాంతో ఈ కేస్ ని ఆనంద్ బృందానికి అప్పగించి ఒకవేళ శ్రీదేవి కేస్ ని పరిష్కరిస్తే అంతకుముందు జరిగిన కేస్ ని జనాలు అందరూ కూడా మర్చిపోతారు అని చెప్తాడు. తర్వాత ఏం జరిగింది. అసలు శ్రీదేవి కేస్ ని పరిష్కరించడానికి జనాలు ఎందుకు సహకరించలేదు. ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
Ads
సినిమా ఫస్ట్ హాఫ్ ఒక కథ. సెకండ్ హాఫ్ ఒక కథ లాగా అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే సీన్స్ ఇంకా జాగ్రత్తగా రాసుకోవాలి. నెక్స్ట్ సీన్ ఏం అవుతుంది అనే ఒక ఆసక్తి కలిగించే లాగా ఆ సీన్స్ ఉండాలి. ఈ సినిమాలో అది ఉంది. ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ట్విస్ట్ సీన్స్ బాగున్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ సాగినంత వేగంగా సెకండ్ హాఫ్ అయితే సాగదు. అయినా కూడా ఆసక్తి తగ్గదు. సాధారణంగా మనం ఒకళ్ళు హంతకులు అనుకోవడం, ఆ తర్వాత ఇంకొకళ్ళని చూస్తే వాళ్లను కూడా హంతకులు ఏమో అని చెప్పి అనుమానం రావడం వంటి సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి.
కానీ కొన్ని ట్విస్ట్ సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆనంద్ పాత్రలో టోవినో థామస్ చాలా బాగా నటించారు. సినిమా అంతా కూడా 90 ల నేపథ్యంలో జరుగుతుంది. ప్రాంతాన్ని, సినిమాటోగ్రఫీని అదే టోన్ లో ఉండేలాగా చూసుకున్నారు. మిగిలిన నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేశారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగానే వస్తాయి. కానీ రియలిస్టిక్ గా చూపించే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మాత్రం చాలా తక్కువగా వస్తాయి. ఈ సినిమా మాత్రం ఇటీవల కాలంలో వచ్చిన ఒక బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాగా నిలుస్తుంది.
ALSO READ : సినిమా పాటలనే కాదు… సీన్స్ ని కూడా వదలట్లేదుగా..? అసలు సీరియల్ లో ఇలాంటి సీన్ ఎందుకు పెట్టారు..?