Ads
కాలం మారే కొద్ది మనిషి తీరు.. మనుషులు మారుతూ ఉంటారు. నిజానికి కాలంతో పాటుగా ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. మన పూర్వీకులని మనం చూస్తే వాళ్లు అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మనం ఉండడంలేదు. వాళ్ళు తిన్న ఆహారాన్ని కానీ వాళ్ళు ఉపయోగించిన వస్తువులను కానీ మనం అనుసరించడం లేదు.
రోజులు గడిచే కొద్ది మారుతున్న టెక్నాలజీతో పాటు మనం కూడా మారిపోతున్నాము. అలానే ఈ తరంలో కోడళ్ళు ఇంటి పనులు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఇది వరకు అలా ఉండేది కాదు. ఎందుకు ఈ తరంలో కోడళ్లు ఇంటి పనులు చేయడానికి ఇష్టపడట్లేదు..? ఈ ప్రశ్నకి ఓ కోరా యూజర్ ఇచ్చిన సమాధానం ఇది. ఇది వరకు ఎక్కువమంది మహిళలు చదువుకునే వారు కాదు చాలా తక్కువ మంది మాత్రమే చదువుకునేవారు. చదువుకున్నా ఉద్యోగం చేసేవారు కాదు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా చదువుకోవడం ఉద్యోగం చేయడం మనం చూస్తున్నాం. ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో మారింది. ఆడవాళ్లు కూడా చదువుకోవాలి. ఉద్యోగం చేయాలని అంత భావిస్తున్నారు. అయితే ఉద్యోగం చేసుకుంటూ వారి పనులు కూడా చేసుకుంటున్నారు. కానీ ఇంటి పనులు మాత్రం చేయడం లేదు.
Ads
కేవలం ఆడవాళ్లు మాత్రమే ఇంటి పనులు చేయాలని వాళ్ళు ఎంత అలసిపోయినా సరే ఇంటి పనులు కచ్చితంగా చేయాలని అంతా అంటున్నారు. ఒకవేళ మగవాళ్ళకి ఆ పనులు వచ్చినా సరే వాళ్ళు ఖాళీగా వున్నా సమయం వున్నా చేయరని… వారికి ఎవరూ చెప్పరని ఆమె సమాధానం ఇచ్చారు. అబ్బాయిలకి ఉండే రూల్స్ వేరు అమ్మాయికి ఉండే రూల్స్ వేరు. అబ్బాయి కనుక వాళ్ళు చేయక్కర్లేదు అని అంతా అంటూ ఉంటారు. అయితే అమ్మాయిలు పని చెయ్యకూడదు అని నేను చెప్పడం లేదు. అబ్బాయిలు చేయకపోయినా ఏమీ అనరు అని ఆమె చెప్తున్నారు. నిజానికి అందరూ పనులు చేసుకోవాలి. అందరూ వంట నేర్చుకోవాలి. కోడలు పనిచేయట్లేదు అని అంతా అంటూ ఉంటారు కానీ కొడుకుని మాత్రం ఎవరూ అడగరని.. సింపుల్ గా వాళ్ళు మగవాళ్ళు కదా అని అంటారని ఆమె చెప్పారు. ఇదే పక్షపాతం అని… ఇబ్బందికరమైన పరిస్థితులు అమ్మాయిలకు కూడా వస్తూ ఉంటాయని ఆమె ఈ ప్రశ్నకి బదులిచ్చారు.