Ads
ప్రపంచంలో, అందులోనూ ముఖ్యంగా భారతదేశంలో పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత వేరే ఏ వేడుకలకు కూడా ఇవ్వరు ఏమో. మనిషి జీవితంలో అది ఒక ముఖ్యమైన విషయం అని చాలా మంది భావిస్తారు. అంత ముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయంలో చాలా మంది జాగ్రత్తగానే ఉంటారు.
వారికి తగ్గ భాగస్వామిని వెతికి పెళ్లి చేసుకుంటారు. అయితే భాగస్వామి బాగున్నా కూడా కొన్నిసార్లు వేరే విషయాల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది వారి భాగస్వామి తల్లిదండ్రులు. ఈ కాలంలో చాలా మంది పెళ్లయిన తర్వాత తమ భాగస్వామి తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు.
అలా ఉండాల్సింది ఆడవారే కాబట్టి, చాలా మంది ఆడవాళ్లు పెళ్లి అయ్యాక తమ భర్తల తల్లిదండ్రులతో ఉండడానికి ఆసక్తి చూపట్లేదు. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కారణాలు చెబుతున్నారు. కానీ నిపుణుల ప్రకారం అసలు మెజారిటీ శాతం ఆడవారు విడిగా ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నారో అనే విషయాన్ని వివరించి చెప్పారు. అసలు ఆడవారు తమ అత్తమామల నుండి విడిగా ఎందుకు ఉండడానికి ఇష్టపడుతున్నారో ఇప్పుడు చూద్దాం.
#1 అభిప్రాయ బేధాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. మనకి వారికి ఉన్న జనరేషన్ గ్యాప్ వల్ల అభిప్రాయ బేధాలు రావడం అనేది సహజం. మొదట్లో సర్దుకుపోయినా కూడా ఆ తర్వాత అవి పెరిగి పెద్దది అవ్వడంతో గొడవలు అవుతాయి. దాంతో చాలా మంది ఇలా గొడవలు పడి ఉన్న బంధాలని చెడగొట్టుకోవడం కంటే విడిగా ఉండి వాటిని కాపాడుకోవడం నయం అని అంటున్నారు.
#2 ఈ కాలంలో చాలా మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో వారు బయటికి వెళ్ళవలసి వస్తుంది. సహాయం కోసం ఎవరిని అయినా నియమించుకున్నా కూడా పనులు ఉంటూనే ఉంటాయి. దాంతో అన్ని బాధ్యతలు నిర్వర్తించడం కష్టం కాబట్టి విడిగా ఉండడం నయం అని అనుకుంటున్నారు.
#3 స్వేచ్ఛ అనేది కూడా ముఖ్యమైన విషయం. ఇలా ఉన్నప్పుడు ఆడవారికి వారికి నచ్చిన పని చేయడానికి స్వేచ్ఛ తగ్గుతుంది. జనరేషన్ గ్యాప్ ఉండడంతో ఒకవేళ వీళ్ళు చేసే పని వారి అత్తమామలకి ఇబ్బంది కలిగిస్తే దానిపై చర్చలు జరుగుతాయి. ఇది మాత్రమే కాకుండా అత్తమామలకి కూడా వారికి నచ్చినట్టు వారు ఉండడానికి కాస్త ఇబ్బంది కలుగుతుంది.
Ads
వారు స్వేచ్ఛగా ఉంటే వారి పిల్లలకి వారు చేసే పనుల వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమో అనే ఆలోచనలు కూడా వస్తాయి అని అంటున్నారు. ఒకవేళ అలా ఇబ్బంది కలిగి వారు ఏమైనా చెప్తే అత్తమామలు కూడా బాధపడతారు. అందుకే విడిగా ఉండడం వల్ల అందరికీ వారికి నచ్చినట్టు ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.
#4 ఇలా కలిసి ఉండడం వల్ల వారు చేసే పనులని ఎవరు గమనిస్తున్నారు అనే ఒక భావన ఏర్పడి అది తర్వాత ఒక రకమైన చిరాకుగా మారుతుంది అని నిపుణులు అంటున్నారు. ఇప్పటికి కూడా ఇలాంటివి అవుతున్నాయి. దీని వల్ల ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి అవతలి వ్యక్తిని తాము భరిస్తున్నాము అనే ఒక ఆలోచన ఏర్పడుతుందట. అందుకే విడిగా ఉండడం నయం అని అంటున్నారు.
#5 ఈ కాలంలో మానసిక ప్రశాంతతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు ఒక మనిషికి ముఖ్యమైనది ఇదే అయినా కూడా దీనిపై సరైన అవగాహన లేని కారణంగా అంతకుముందు కాలంలో దీన్ని అంత పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మానసిక ప్రశాంతత ఉంటే ఆ మనిషి తన జీవితాన్ని, తనతో ఉండే వారి జీవితాలని కూడా సులభంగా ఉంచగలుగుతాడు.
అంతే కాకుండా తన సమస్యలను కూడా జాగ్రత్తగా పరిష్కరించుకుంటాడు. ఇలా అత్తమామలతో కలిసి ఉండడం, ఒకవేళ వారికి అభిప్రాయ బేధాలు వస్తే దాని వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం వల్ల కోడళ్ళు తమ కుటుంబంపై అంటే వారి తర్వాతి తరం వారు అయిన వారి పిల్లలపై శ్రద్ధ వహించలేరు అని నిపుణులు చెప్పారు.
అయితే కలిసి ఉంటే ఇలాంటి నష్టాలు మాత్రమే కాకుండా చాలా లాభాలు కూడా ఉంటాయి. కానీ ఆలోచన శైలి మారడంతో ఇప్పటి కాలం ఆడవారు తమ అత్తమామల నుండి విడిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అని, అలా ఉండడం వల్ల వారి అత్తమామలతో ఉన్న బంధం వారికి ఇంకా బలపడుతోంది అని ఎంతో మంది నిపుణులు అలాగే ఎంతో మంది ఆడవారు కూడా సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు.
ALSO READ : మీరు ప్రేమించిన వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే వెంటనే బ్రేక్ అప్ చెప్పేయండి..?