Ads
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అతని చిన్ననాటి ఫోటోస్, త్రో బ్యాక్ పిక్స్, వీడియోస్ నెట్టింట రెండు మూడు రోజుల నుంచి తెగ హడావిడి చేస్తున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకమైన వీడియోలను విడుదల చేశారు.
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు మెగాస్టార్ పుట్టినరోజు ని పెద్ద మెగా ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు.అయితే ఈ క్రమంలో విడుదలైన అన్ని చిత్రాలలోకి ఒక రేర్ పిక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
సోషల్ మీడియాలో చిరు బర్త్డే కేక్ కట్ చేస్తుండగా పక్కన నిలబడ్డ ఆ కుర్రాడు ఎవరు అన్న డిస్కషన్ జరుగుతోంది. చిరంజీవికి సంబంధించిన ఈ త్రో బ్యాక్ పిక్చర్ లో అతని పక్కన నిలబడి ఉన్నది మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసిన పవన్ ఆ తరువాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
Ads
గత సంవత్సరం తన అన్న పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పవన్ ఈ రేర్ పిక్ షేర్ చేశారు. తన చిన్నతనంలో అన్న పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తీసిన ఆ ఫోటోని ఇన్ని సంవత్సరాలకు పవన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దానితోపాటుగా అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒక ఎమోషనల్ మెసేజ్ కూడా రాశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ALSO READ : “ఖుషి” లాగానే టైటిల్ ని రిపీట్ చేసిన 15 సినిమాలు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!