Ads
కాబోయే భార్య ఇలా ఉండాలి.. అలా ఉండాలని ప్రతీ ఒక్కరికీ ఎన్నో అనిపిస్తూ ఉంటుంది పైగా కాబోయే భార్య తో ఎలా ఉండాలి అనే దాని మీద కలలు కూడా వస్తూ ఉంటాయి. మీ భార్యలో కనుక ఈ లక్షణాలు ఉంటే ఇక మీ లైఫ్ కి ఎటువంటి ఢోకా ఉండదు. హ్యాపీగా జీవితాంతం ఉండొచ్చు. భార్య భర్తల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య బంధం వివిధ కారణాల వలన బలహీనంగా మారిపోతూ ఉంటుంది.
అలాంటి సమయంలో భార్య మళ్ళీ బంధాన్ని బలంగా మారుస్తుంది. పెళ్లి చేసుకోవాలని మీరు డిసైడ్ అయ్యి ఉంటే ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది.
#1. నిజాయితీగా ఉండడం:
భార్య నిజాయితీగా ఉండడం చాలా అవసరం. భార్య తన భర్తతో నిజాయితీగా ఉంటే ప్రేమ, నమ్మకం ఉంటుంది. ప్రతి ఒక్క భార్య కూడా నిజాయితీగా ఉండాలి.
#2. చెప్పినది వినడం:
భర్త చెప్పే ప్రతి మాట కూడా భార్య వినాలి. భర్త చెప్పినట్లుగా నడుచుకోవాలి. అప్పుడు వాళ్ళ మధ్య బంధం బాగుంటుంది. గొడవలు రావు.
Ads
#3. తప్పులను ఒప్పుకోవడం:
స్త్రీ ఏదైనా తప్పు చేస్తే వెంటనే దానిని ఒప్పుకోవాలి. ఎవరైనా కూడా తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవాలి.
#4. అబద్ధాలు చెప్పరాదు:
అబద్ధాలు ఎప్పుడు ఎవరూ చెప్పకూడదు. వైవాహిక జీవితంలో కూడా అబద్ధాలు చెప్పకూడదు భార్యకి అబద్దాలు చెప్పే అలవాటు అసలు ఉండకూడదు. ఇలా ఈ అలవాట్లు ఉన్న భార్య దొరికితే మీరు అదృష్టవంతులే.
ఈ మధ్యకాలంలో చాలామంది భార్య భర్తలు తరచూ గొడవలు పడుతున్నారు తర్వాత విడిపోవడం మంచిదని నిర్ణయించుకుంటున్నారు. ఆవేశంలో నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. కాస్త ఆలోచించి తీసుకుంటేనే మంచిది. భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండేందుకు ప్రయత్నం చేయాలి తప్ప విడిపోవాలని అనుకోకూడదు. వీలైనంతవరకూ సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న మాటని ప్రతి ఒక్క సందర్భాన్ని సాగ తీసుకుంటూ వెళ్తే బంధం ముక్కలు అయిపోతుంది అందులో సందేహమే లేదు.