చిరంజీవి ‘ఘరానా మెగుడు’ హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Ads

మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. చిరంజీవి సినిమాల్లోకి వచ్చి తన నటనతో అందరిని ఆకట్టుకుని ఈ స్థాయికి వచ్చారు. చాలామంది ఇప్పటి హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వస్తున్నారు. చిరంజీవి 150 కి పైగా సినిమాల్లో నటించారు. చిరంజీవి సినిమాల్లో ఘరానా మొగుడు కూడా ఒకటి. 1992లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నగ్మా నటించారు. కే రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 10 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది.

 ఈ సినిమాలోని బంగారు కోడిపెట్ట పాట ఎంతో హిట్ అయింది. డిస్కో శాంతి చిరంజీవి కలిసి ఈ పాటకి స్టెప్పులు వేశారు. వాణి విశ్వనాథ్ చిరంజీవి పక్కన నటించి అందరినీ ఆకట్టుకున్నారు. వాణి విశ్వనాథ్ చిరంజీవి ఒక రొమాంటిక్ పాటకి డాన్స్ కూడా వేశారు.

Ads

కిటుకులు తెలిసిన అనే పాట అప్పట్లో ట్రెండ్ అయిపోయింది. ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ రొమాంటిక్ సాంగ్ ఏ. ఈ సినిమాతో వాణి విశ్వనాధ్ ఒక్కసారిగా క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ సినిమాలో చిరంజీవి వాణి మధ్య వచ్చిన సీన్లు పాటలు హైలెట్ గా అయిపోయాయి. ఈ సినిమా తర్వాత ఈమె నా మొగుడు నాకే సొంతం అనే సినిమాలో నటించింది. అలానె ప్రేమ చిత్రం ప్రేమ విచిత్రం, లేడీస్ స్పెషల్ మొదలైన సినిమాల్లో ఈమె నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా ఈమె తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈమె కేరీర్ బాగా సాగుతున్న సమయంలో ప్రముఖ మలయాళ నటుడు బాబురావుని పెళ్లి చేసుకుంది.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత ఈమె జయ జానకి నాయక వంటి సినిమాలు చేసింది. తర్వాత ఈమె రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది నగరి నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె ఒక వివాహ వేడుకలో కనబడి అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె కాస్త బొద్దుగా మారింది. కానీ అదే అందం. అందంలో మాత్రం తగ్గేదేలేదు అంటోంది. ప్రస్తుతం వాణి విశ్వనాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Previous articleఈ లక్షణాలు ఉన్న భార్య మీ లైఫ్ లోకి వస్తే… రోజూ ఆనందమే..!
Next articleఇతరుల శరీరం నుంచే వచ్చే వాసన వలన.. మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు తీసుకు వస్తుంది..?