Ads
ప్రస్తుతం బుల్లితెర ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో ముందుగా చెప్పినట్లే అన్ని ఉల్టా పుల్టా గా జరుగుతున్నాయి. వీకెండ్ దగ్గర పడుతోంది…ఒకపక్క పవర్ అస్త్ర కోసం పోరు కంటిన్యూ అవుతుంటే మరోపక్క ఎలిమినేషన్స్ తరుముకొస్తున్నాయి. మొత్తానికి 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో ప్రస్తుతం 11 మందితో కంటిన్యూ అవుతుంది. అయితే ఈసారి ఏకంగా డబల్ ఎలిమినేషన్ ధమాకా ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
హౌస్ లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్ లో సందీప్, శివాజీ, శోభా శెట్టి టాస్కులలో తమ సత్తా చాటి పర్మినెంట్ హౌస్ నెంబర్స్ అయ్యారు.. అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా ఎంతో చాకచక్యంగా నాలుగో పవరాస్త్ర సంపాదించి ఇంటి సభ్యుడిగా మారిపోయాడు. ఇప్పుడు నాలుగో వారం ప్రియాంక జైన్, శుభ శ్రీ, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ.. ఈ 6 మంది నామినేషన్ లో ఉన్నారు. అంటే వీరిలో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు అని అందరూ అనుకున్నారు.
Ads
ప్రస్తుతం ఓటింగ్ లో ప్రిన్స్ యావర్ అందరికంటే ముందు ఉన్నాడు.. టేస్టీ తేజ ఈసారి ఎలిమినేట్ అవ్వడం కన్ఫామ్ అని అనుకుంటున్న అందరికీ బిగ్ బాస్ డబల్ ఎలిమినేషన్ షాక్ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న బ్యూటిఫుల్ స్నేక్ రతిక ఈవారం ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ లో కూడా రతిక ,తేజ మధ్యలో పెద్ద తేడా లేదు.. కాబట్టి ఈసారి బిగ్ బాస్ తేజ తో పాటు రతిక పాపని కూడా ఇంటికి పంపించే అవకాశం ఉంది అని బిగ్ బాస్ వర్గాల సమాచారం
ఆ పని చేస్తే బిగ్ బాస్ హౌస్ లో సగం దరిద్రం పోతుంది అని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నీ ఆట నువ్వు ఆడు మనుషులతో ఆడకు అని డైరెక్ట్ గా నాగార్జున చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా మనుషులతో ఆడడం రతిక కు అలవాటు అయిపోయింది. హౌస్ లో ఉండి ఇన్ని డ్రామాలు వేసే రతిక బయటకు వచ్చాక మరెంత డ్రామా వేస్తుందో చూడాలి. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్స్ రంజుగా ఉంటాయి అనిపిస్తుంది.