Ads
మనదేశంలో జ్యోతిషానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మనిషి పుట్టినప్పటి నుండి చావు వరకూ జరిగే ప్రతి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటారు. ఇక మనిషి జీవితంలో ముఖ్యమైన పెళ్లి చేయాలంటే తప్పకుండా అమ్మాయి, అబ్బాయి జాతకాలు చూస్తారు.
Ads
ఇద్దరి జాతకాలు కలిస్తేనే పెళ్లి జరిపిస్తారు. అయితే పెళ్లిళ్ళ విషయంలో హిందూ సంప్రదాయంలో కొన్ని నియమాలను పాటిస్తుంటారు. వాటిలో మూల నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకోకూడదు అని అంటారు. అలా విన్నప్పుడు అందరిలోనూ మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది అనే సందేహం వస్తుంది. మరి దాని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకోకూడదని ప్రచారం ఎప్పటి నుండో ఉంది. కాదని ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని చేసుకుంటే జీవితంలో చాలా ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తుందని అంటూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రపరంగా అయితే మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడని అంటున్నారు. మూల నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకోకూడదని కొంతమంది కేవలం వాళ్ల భుక్తి కోసమే అపోహలను సృష్టించి, తప్పుగా చెబుతున్నారు.అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పంచాంగంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటే, వాటిలో మూల, ఆరుద్ర, జేష్ట నక్షత్రాలలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటేనే నష్టపోతారని వ్యర్ధ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఈ ప్రచారంలో కొంచెం కూడా నిజం లేదంటున్నారు. ఏ నక్షత్రంలో పుట్టినవారైనా కష్టపడి పని చేస్తేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని, అంతేకాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మితే కాదని అంటున్నారు. అంతేకాకుండా ఏ నక్షత్రంలో పుట్టినవారిని అయిన వివాహం చేసుకోవచ్చని, అలా చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెబుతున్నారు.
Also Read: గోమూత్రం ఇంట్లో చల్లడం వాళ్ళ కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా?