గోమూత్రం ఇంట్లో చల్లడం వాళ్ళ కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా?

Ads

ఆవును హిందువులు పవిత్రమైన జంతువుగా పూజిస్తారు. గోమాత అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నుండి భారతదేశంలో గోమాతను పూజిస్తూ వస్తున్నారు. పురాణాలు, వేదాలలోను ఆవును ఆరాధించారు. ఆవు పాల దగ్గర నుండి మూత్రం వరకు అన్ని పవిత్రంగా చూస్తారు.

Ads

భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా జ్యోతిష్య శాస్త్రాలను, వాస్తుశాస్త్రలను చాలా ఎక్కువగా విశ్వసిస్తారు. రోజువారీ జీవితంలో జ్యోతిషం అనేపదాన్ని తరుచుగా వినపడుతూనే ఉంటుంది. ఇక ఇంట్లో ఒక్కరి జాతకంలో దోషం ఉన్నా కూడా ఆ ఇంట్లో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి. అయితే అలా ఫ్యామిలిలో సమస్యలు వస్తున్నప్పుడు వాళ్ళు జ్యోతిషశాస్త్ర నిపుణులను, వాస్తు శాస్త్ర నిపుణులను కలిసి పరిష్కార మార్గాన్ని అడుగుతూ ఉంటారు.
అయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, సమస్యలు తొలగిపోవాలంటే, ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఇంట్లోప్రతికూల పరిస్థితులు లేకుండా కుండా చూసుకోవాలి. దానికోసం ప్రతి రోజు పెందలకడే నిద్ర లేచి, తల స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని, ఆ తర్వాత గోమూత్రంలో కొంచెం నీటిని కలిపి ఇంటి లోపల, బయట ఇంటి చుట్టూ, డబ్బును దాచి పెట్టె చోట, వంటగదిలో కూడా చల్లాలి. అంతేకాకుండా వంట పాత్రల పై చల్లాలి. ఎందుకంటే గోమూత్రానికి అన్ని రకాల పాపాలను పోగొట్టే శక్తి ఉంటుంది.ఇలా ప్రతి రోజు చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మన ఇంటి పై ఏదైనా చెడు ప్రభావం ఉన్న కూడా తొలగిపోతుంది. ఇంటిని గోమూత్రంతో శుభ్రం చేయడం వల్ల దోషాలు తొలగిపోవడమే కాకుండా, ఆర్థిక కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే గోమూత్రం తీసుకువచ్చిన తరువాత అందులో పసుపు నీరు కలిపి, ఆ తరువాత ఆ నీటిని ప్రతి మంగళవారం, శుక్రవారం ఇంట్లో చిలకరించాలి. పసుపు మంగళకరమైనది. అదే కాకుండా లక్ష్మీదేవికి పసుపు చాలా ఇష్టం. అందువల్ల పసుపు నీటితో ఇంటిని శుభ్రం చేసినపుడు లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం ఉంటుందని విశ్వసిస్తారు.

Also Read: ఇళ్ళకి దిష్టి బొమ్మలను ఎందుకు పెట్టకూడదు.?. కారణం ఇదే..!

Previous articleతెలుగులో రీమేక్ అయిన 10 మలయాళ చిత్రాలు, వాటి ఫలితాలు
Next articleమహేష్ బాబు నుండి నిఖిల్ వరకు.. తెలుగులో 100 కోట్ల క్లబ్ లో చేరిన 11 మంది హీరోల సినిమాల జాబితా..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.