Ads
మామూలుగా మన సొసైటీలో సిగరెట్, మందు లాంటి అలవాట్లు చాలా చెడ్డవి అని అంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు సిగరెట్ తాగే వారిని ఒక దోషిని చూసినట్టు చూడడం మనం గమనిస్తాం. మరి ముఖ్యంగా భార్య అయితే ఇటువంటి అలవాట్లు ఉంటే మానేయమని పోరు పెడుతూ ఉంటుంది.
ఈ అలవాట్ల కారణంగా ఎన్నో సంసారాల్లో నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దానికి భిన్నంగా ఉంది.
భర్త వెనక కూర్చుని బైక్ లో వెళ్తున్న ఆ భార్య చేసిన పని చూసి నేటిజెన్లు ఇలాంటి భార్య ఉంటే బాగుండు అంటూ కామెంట్లు పెట్టి పొగిడేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే బైక్ పై భర్తతో కలిసి వెళ్తున్న భార్య డ్రైవింగ్ చేస్తూ స్మోకింగ్ చేయడం భర్తకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్ దేశం అతనికి కోఆపరేట్ చేసింది. భర్త బైక్ డ్రైవ్ చేస్తుండగా వెనక వైపు కూర్చొని సిగరెట్ పట్టుకొని అతనికి అవసరమైనప్పుడు పఫ్ తీసుకోవడానికి అందిస్తోంది.
Ads
ఇలా బైక్ డ్రైవ్ చేస్తూ భార్య హెల్ప్ తో మద్య మధ్యలో అతను పఫ్ తీసుకొని బండి తోలుతూ స్టైల్ గా వెళ్లడం వీడియోలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వెనకాలే కారులో వస్తున్న ఒక వ్యక్తి ఈ వింతను చూసి తట్టుకోలేక రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదండోయ్ ఆ పోస్ట్ కి ఇలాంటి భార్య నాకు కూడా ఉంటే బాగుండు అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇప్పటికే ఈ పోస్టుని 175.1k మంది చూశారు అంటే అది ఏ రేంజ్ లో వైరల్ అయిందో చూడండి. కొంతమంది భార్యను పొగుడుతుంటే కొంతమంది మాత్రం ముందు పిల్లాడిని కూర్చోబెట్టుకొని మరి ఇన్ని స్టంట్ లు అవసరమా.. అని కామెంట్ చేస్తున్నారు.
watch video :
ALSO READ : మీ మధ్య ఇలా ఉంటే ప్రేమ వున్నట్టే.. లైఫ్ లో నో ప్రాబ్లెమ్..!