మీ మధ్య ఇలా ఉంటే ప్రేమ వున్నట్టే.. లైఫ్ లో నో ప్రాబ్లెమ్..!

Ads

వివాహానికి అర్థం ఇదివరకు ఒకలా ఉంటే ఇప్పుడు ఒకలా ఉంటోంది. చాలామంది యువత తప్పు నిర్ణయాలని తీసుకుంటున్నారు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు దాని వలన లైఫ్ అంతా కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఈరోజుల్లో డేటింగ్ చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం.

చాలా మంది రెస్పాన్సిబిలిటీని తీసుకోకుండా నచ్చినట్లుగా డేటింగ్ చేస్తూ ఉంటున్నారు నిజానికి బాధ్యత అనేది చాలా ముఖ్యం. కానీ నిజానికి డేటింగ్ అనేది ఒక బాధ్యతగా భావించాలి. ప్రేమించినా లేదంటే డేటింగ్ చేసిన ఎప్పుడు ఫిక్స్ అయిపోకండి.

ఆ తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే మళ్లీ ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. చూద్దాం ముందుకు వెళ్దాం ఏమవుతుంది అనే సందేహంతోనే రోజు ఉండండి. అంతేకానీ ఒక రోజు ఫిక్స్ అయిపోయారు అంటే తర్వాత సమస్యలను ఎదుర్కోవాలి. అదే పెళ్లి అయితే లైఫ్ పార్ట్నర్ అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. డేటింగ్ లో ఉన్నప్పుడు ఎదుట వాళ్ళని బాగా గమనిస్తూ ఉండాలి.

Ads

ఆలస్యంగా వస్తున్నారా లేకపోతే ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు అలుగుతున్నట్లయితే ఎంతవరకు దానిని సాగదీస్తున్నాడు… ఇటువంటివన్నీ కూడా గమనిస్తూ ఉండాలి.. అలానే ఇద్దరూ కూడా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారా లేకపోతే ఇద్దరూ కలిసి ఉంటే ఆనందం ఎక్కువ ఉంటోందా అనేది కూడా గమనిస్తూ ఉండాలి. అలానే ఒక విషయంలో ఒక వ్యక్తి అలిగితే మరొక వ్యక్తి కూడా అదే చేయకూడదు.

వాళ్లు అలాగే ఉన్నారని వీళ్లు ఒక కొత్త స్టార్ట్ ని స్టార్ట్ చేయాలి అప్పుడు బంధం బాగుంటుంది. సమయం వృధా అవ్వదు. ఒకవేళ కనుక ఎక్కువసేపు ఒకరు అలుగుతున్నట్లయితే ఆ విషయాన్ని కాస్త గట్టిగానే మైండ్ లోకి తీసుకోవాలి చిన్న విషయానికే ఇంత అలక ఉంటే రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తే ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది చూసుకోవాలి.

ఎన్నిసార్లు ఇలా జరుగుతోంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకునేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలని గమనించాలి. పదేపదే అదే సిట్యువేషన్ ఎదురవుతున్నట్లయితే ఓపిక నశిస్తుంది. కాబట్టి ఎక్కువగా వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నట్లయితే లైఫ్ లో ఎంతో కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఇద్దరి మధ్యా కూడా అంతా బాహుంతుంటే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళచ్చు. చదువుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడుకుని రిలేషన్ ని ఇంకో మెట్టు ఎక్కించవచ్చు.

Previous articleబాల‌య్య‌, చిరంజీవి గురించి అప్పట్లో ఎన్టీఆర్ ఇలా అన్నారా..? నిజమైందిగా మరి..!
Next articleవిశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైన ‘పేక మేడలు’ టీజర్