Ads
ఇంట్లో ఒక కుటుంబం కలిసి ఉంటున్నప్పుడు బాధ్యతలు పంచుకుంటారు. అందులోనూ ముఖ్యంగా పెళ్లి అయ్యాక భార్యా-భర్త బాధ్యతలని సమానంగా పంచుకొని నిర్వర్తిస్తూ ఉంటారు.
అయితే, పెళ్లయ్యాక మగవాళ్ళకి ఉద్యోగంలో పెద్దగా సమస్యలు రావు కానీ, ఆడవాళ్లు ఉద్యోగం చేయాలి, ఇల్లు కూడా చూసుకోవాలి అంటే చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. పెళ్లయ్యాక బాధ్యతలు నిర్వర్తించడంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ మీద ఎక్కువగా అంచనాలు ఉంటాయి.
ఇది సమాజంలో ఎప్పటినుండో ఏర్పడిన ఒక విషయం. పెళ్లయ్యాక ఆడవారు బాధ్యతలు ఎక్కువగా తీసుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. అందుకు తగ్గట్టే ఆడవాళ్లు బాధ్యతలు ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే, మరొక పక్క ఇల్లు కూడా చూసుకుంటూ ఉంటారు. కొంత మంది ఆడవారు ఇంటి పనులు పెద్దగా చేయకుండా ఉద్యోగం మీద శ్రద్ధ పెడతారు. కానీ కొంత మంది ఆడవారు మాత్రం ఇంటి పని ఎక్కువగా చూసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
అయితే, మిగిలిన దేశాలలో కంటే భారత దేశంలో ఇలాంటి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఆడవారు ఇంట్లో పనులు సరిగ్గా చూసుకోకపోతే సమాజంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు. కొంత మంది ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు. కానీ కొంత మంది మాత్రం ఇలా ఎవరైనా అనుకుంటారు అనే ఆలోచనతో ఇంటి పనుల మీద ఎక్కువగా తమ సమయాన్ని కేటాయించాలి అని అనుకుంటారు. అయితే, అసలు ఆడవాళ్లు బయటికి వెళ్లి పనిచేయటానికి ఇష్టపడుతున్నారా? ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారా?
Ads
2017 లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం చాలా మంది ఆడవాళ్లు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పనిలో ఉండే ఒత్తిడి వల్ల ఇంట్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. కానీ కాలం మారింది. దాంతో ఈ పని ఒత్తిడి మేనేజ్ చేసుకోవడం కూడా మారింది. అందుకే మెల్లగా ఉద్యోగం చేయాలి అని అనుకునే ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. లాక్ డౌన్ తర్వాత ఇలాంటి ఆడవారి సంఖ్య మరింత పెరిగింది. వర్క్ ఫ్రం హోం అనే ఒక ఆప్షన్ ఉండడం వల్ల చాలా మంది ఆడవాళ్లు పనిచేయాలి అని అనుకుంటున్నారు.
కొంత మంది ఆడవాళ్ళు మాత్రం బయటికి వెళ్లి పని చేయాలి అనుకుంటే, కొంత మంది ఆడవాళ్లు మాత్రం ఇంట్లో ఉండే పని చేయాలి అని అనుకుంటున్నారు. ఏదేమైనా సరే ఉద్యోగం చేయాలి అనుకునే ఆడవారి సంఖ్య ఎక్కువ అయ్యింది. కొంత మంది ఆడవారు మాత్రం ఇంటి బాగోగులు చూసుకోవాలి అని అనుకుంటున్నారు. అంతకుముందు బయటికి వెళ్లి ఉద్యోగం చేయడం, ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోవడం. ఈ రెండు అవకాశాలు మాత్రమే ఉండేది. కానీ లాక్ డౌన్ తర్వాత వర్క్ ఫ్రం హోం అనే ఆప్షన్ వచ్చింది.
దాంతో ఇంట్లో ఉండే చాలా మంది ఆడవారికి ఇది తమ కాళ్ళ మీద తాము ఆర్థికంగా నిలబడడానికి ఒక అవకాశం కల్పించింది. అందుకే ఇంట్లో ఉండే ఆడవాళ్లలో చాలా మంది ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టడంతో, ఉద్యోగం చేయాలి అనుకునే ఆడవారి సంఖ్య పెరిగింది. దాంతో, ఇంట్లో నుండి అయినా సరే, బయటికి వెళ్లి అయినా సరే ఉద్యోగం మాత్రం చేయాలి అని అనుకునే ఆడవారు చాలా మంది ఉన్నారు.
మెజారిటీ శాతం ఆడవారు ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారు. మిగిలిన ఆడవారు మాత్రం ఇంట్లో ఉండే బాధ్యతల వల్ల ముందు ఇంటి బాధ్యతలు తీసుకొని అవి సక్రమంగా నిర్వర్తించాలి అని అనుకుంటున్నారు. ఇంటిని చూసుకోవడం కూడా చిన్న బాధ్యత ఏమీ కాదు కాబట్టి దానిపై శ్రద్ధ పెట్టి, ప్రతి పనిని కరెక్ట్ గా చేయాలి అని అనుకుంటున్నారు.
ALSO READ : బుల్లితెరపై “టాప్ – 5 మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్” వీరే…టాప్-1 లో ఉన్నది ఎవరంటే.?