Ads
ఇండియాలో ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. వేగంగా డెవలప్ అవుతున్న సిటీగా పేరుగాంచింది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినవారు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారే కాకుండా ఇతర దేశాలవారు కూడా నివసిస్తున్నారు.
అయితే దేశంలో రెండు హైదరాబాద్ లు ఉన్నాయని చాలామందికి తెలియవు. ఒకటి తెలంగాణలో ఉంటే, మరొకటి ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ఇక ఈ ప్రపంచంలో మొత్తం 84 పైగా హైదరాబాద్ ఉన్నాయట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నగరం. ఇక్కడ ఎన్నో అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. లక్షలాది మంది ఊర్ల నుండి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. దేశంలో హైదరాబాద్ లు రెండు ఉన్నాయి. యూపీలో మరొకటి ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 84 హైదరాబాద్ పేరుతో ఉన్నాయని తెలుస్తోంది. వాటిలో కొన్ని నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలు కూడా ఉన్నాయి.
కెనడాలోని అంటారియోలోని మిస్సిసాగా దగ్గర మరియు సౌదీ అరేబియాలోని రియాద్‌లోని ఖలీదియా ప్రాంతంలో హైదరాబాద్ పేరుతో స్ట్రీట్స్ ఉన్నాయి. ఇరాన్‌లో ఎక్కువ సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు మరియు నగరాలు హైదరాబాద్ పేరుతో మొత్తం 71 ఉన్నాయి. ఇరాన్ తర్వాత అజర్‌బైజాన్ లో 10 ప్రదేశాలు హైదరాబాదు (Heydarabad). బంగ్లాదేశ్ లో ఒక హైదరాబాద్, పాకిస్తాన్ లో ఒక హైదరాబాద్ ఉంది. భారత్, పాకిస్థాన్‌లు స్పెల్లింగ్ హైదరాబాద్ Hyderabadను ఇష్టపడుతుండగా, బంగ్లాదేశ్ హైదరాబాదు Haidarabadను ఎంచుకుంది. ఇరాన్ మరియు అజర్‌బైజాన్‌లలో, హైదరాబాదుకు Heydarabad స్పెల్లింగ్ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
బ్రిటిష్ పాలనలో హైదరాబాదును Haidarabad అని పిలుస్తారు. 19వ శతాబ్దంలో హైదరాబాద్‌ను Haidarabad మరియు సికింద్రాబాద్‌గా Sikandarabad వ్రాసినట్లు పాత పుస్తకాలు మరియు ఆర్కైవల్ రికార్డులు చూపిస్తున్నాయి. 20వ శతాబ్దపు తొలిరోజుల్లో హైదరాబాదు ఎప్పుడు Hyderabadగా మారిందో స్పష్టంగా తెలియదు. ఇంగ్లీష్ ఓరియంటలిస్ట్ సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ 19వ శతాబ్దంలో ప్రచురించబడిన తన రచనలలో ఈ నగరాన్ని Haidarabad అని పేర్కొన్నాడు. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హైదరాబాద్‌లలో అతిపెద్ద మరియు అత్యంత ఆధునికమైన నగరంగా కొనసాగుతోంది.
Ads
Also Read: ఏంటి “హ్యుండాయ్” కార్లపై లోగోలో ఉన్నది “H” కాదా.? దాని వెనకున్న అర్థం ఏంటంటే.?