Ads
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా యువ. తమిళంలో ఈ సినిమా ఆయుధ ఎళుత్తు పేరుతో రూపొందించారు. తెలుగులో ఈ సినిమాని యువ పేరుతో అనువదించారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోలుగా నటించారు. ఈషా డియోల్, మీరాజాస్మిన్, త్రిష హీరోయిన్లుగా నటించారు. సినిమాకి చాలా మంచి స్పందన లభించింది. ముగ్గురు వ్యక్తులు. మూడు భిన్న మనస్తత్వాలు. వారి కథలు.
ఈ నేపథ్యంలోనే సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో సూర్య పాత్రకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్యకి ఈ సినిమా స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో సూర్య మైఖేల్ వసంత్ అనే పాత్రలో నటించారు. సూర్య పాత్రకి ఒక తెలుగు వ్యక్తి ఇన్స్పిరేషన్ అనే సంగతి చాలా మందికి తెలియదు. ఆ వ్యక్తి స్పూర్తితోనే సూర్య పాత్రను మణిరత్నం రూపొందించారు. ఆయన జార్జ్ రెడ్డి. సినిమా స్టోరీ అంతా కూడా జార్జ్ రెడ్డి కథని ఆధారంగా తీసుకొని చేశారు.
Ads
అయితే ఇందులో జార్జ్ రెడ్డి పాత్రను మాత్రం సూర్య పాత్ర లాగా రూపొందించారు. సూర్య పాత్రలో జార్జ్ రెడ్డి ప్రవర్తన ఉండేలాగా డిజైన్ చేశారు. అప్పట్లో ఈ పాత్రను చూసి చాలా మంది ప్రశంసించారు. ఆ తర్వాత తెలుగులో జార్జ్ రెడ్డి సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రెండు సినిమాలు రూపొందాయి. ఒక సినిమా ఆయన కథ ఆధారంగా రూపొందితే, జార్జ్ రెడ్డి సినిమా మాత్రం ఆయన మీద రూపొందిన సినిమా. రెండు సినిమాలకి మధ్య దాదాపు 14 సంవత్సరాల తేడా ఉంది. 2004 లో యువ సినిమా వచ్చింది.
పాత్ర పేర్లు వేరేగా పెట్టినా కూడా జార్జ్ రెడ్డి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని సూర్య పాత్ర రూపొందించారు. యువ సినిమాకి తెలుగులో సూర్య పాత్రకి రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. ఎందుకంటే, ఈ సినిమాలో మాధవన్ పోషించిన పాత్రకి శ్రీనివాస్ మూర్తి డబ్బింగ్ చెప్పారు కాబట్టి. బహుశా, సూర్య పాత్రకి రవిశంకర్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఇది ఒక్కటే ఏమో. మీరాజాస్మిన్ పాత్రకి నటి రోహిణి డబ్బింగ్ చెప్పారు. సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది.