కల్కి 2898 AD ట్రైలర్ లో వీళ్ళని గమనించారా..? గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చే ఇతర నటులు ఎవరంటే..?

Ads

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కి చాలా మంచి స్పందన వస్తోంది. దీపికా పదుకొనే ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. మొదటి సినిమా అయినా కూడా తన డబ్బింగ్ అని చెప్పుకున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దిశా పటాని కూడా ఈ సినిమాలో ఉన్నారు. కమల్ హాసన్ ఈ సినిమాలో ఒక పాత్రలో నటించారు. సినిమా మొత్తం కమల్ హాసన్ పాత్ర ఉండదు.

actors in kalki 2898 ad movie

కేవలం కొంత సేపు మాత్రమే కనిపిస్తారు. ట్రైలర్ చూస్తూ ఉంటే నాగ్ అశ్విన్ చాలా విషయాలను ట్రైలర్ లో చూపించకుండా దాచి పెట్టారు అని తెలుస్తోంది. ట్రైలర్ లో రాజేంద్రప్రసాద్ కూడా కనిపించారు. సినిమాలో వీళ్ళతో పాటు, మృణాల్ ఠాకూర్ కూడా ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత సీనియర్ నటి శోభన ఈ సినిమాలో కనిపించారు. దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో ఒక పాత్ర పోషిస్తారు అని తెలుస్తోంది. అయితే అర్జునుడి పాత్ర పోషించే హీరో కూడా మరొకరు ఉన్నారు అని అంటున్నారు. ఆ హీరో విజయ్ దేవరకొండ అనే వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ బుజ్జి పాత్రకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Ads

వీళ్లు ఈ సినిమాలో ఉంటారు అని ప్రచారం జరుగుతోంది. సినిమా కోసం కొన్ని ఏళ్ల నుండి సినిమా బృందం అంతా కష్టపడుతున్నారు. చిన్న చిన్న విషయాల మీద కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒక షాట్ కోసం దాదాపు నెల రోజులు పని చేసినట్టు తెలుస్తోంది. సినిమా కొన్ని నెలల క్రితమే విడుదల కావాల్సి ఉన్నా కూడా, వాయిదా పడి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. పెద్ద సినిమా కాబట్టి భారీ తారాగణం ఉంటుంది. ఇంకా చాలా మంది నటీనటులని ఈ సినిమాలో చూసే అవకాశం ఉంది.

ఈ సినిమా ఈ ఒక్క సినిమాతో ఆగదు. తర్వాత ఈ సినిమాకి భాగాలు వస్తూ ఉంటాయి. కానీ అందులో ఎవరెవరు ఉంటారు అనేది మాత్రం ఇంకా తెలియదు. ట్రైలర్ లో కనిపించిన వారితో పాటు, పైన చెప్పిన వారు కూడా సినిమాలో ఉంటారు అనే సమాచారం మాత్రం వస్తోంది. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.

Previous articleపాండవులు ద్రౌపది విషయంలో పెట్టుకున్న నియమం ఏంటో తెలుసా..? తిలోత్తమ విషయంలో ఇలా జరగడంతో..?
Next articleయువ సినిమాలో సూర్య పాత్ర… ఆ వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రూపొందించారా..? ఎవరంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.