Ads
సిని పరిశ్రమ అంటే పూల పాన్పు కాదు. సినిరంగంలో ఉన్నవారికి డబ్బులకు కొదువ ఉండదని అనుకుంటారు. కానీ అవన్నీ అపోహలే. ఈ రంగంలో రాణించాలంటే ఖచ్చితంగా సక్సెస్ ఉండాలి.
సక్సెస్ వస్తేనే తప్ప ఎవ్వరూ ఎవ్వరినీ నమ్మరు ఇక్కడ. ఇక కోట్లలో సంపాదించిన కూడా సెటిల్ అయినట్లే అని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ సంపాదించిన వాళ్ళు, మళ్ళీ అక్కడే పెట్టి కోట్లు పోగొట్టుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఇక ఈ జాబితాలో హీరోయిన్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం..1.సావిత్రి :
మహానటి సావిత్రి తెలుగు, తమిళ సినీ రంగాలలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. ఆమె ‘చిన్నారి పాపలు’ అనే సినిమాని నిర్మించి లక్షల్లో నష్టపోయారు. ప్రస్తుత రోజుల్లో దాని విలువ వంద కోట్లు వరకు ఉంటుందని అంచనా.
2.జయసుధ :
సహజ నటిగా పేరు పొందిన అప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ. ఆమె కలికాలం, కాంచన సీత, వింత కోడళ్ళు, అదృష్టం లాంటి సినిమాలు నిర్మించి సంపాదించింది అంతా పోగొట్టుకుంది.
3.శ్రీదేవి :
జగదేక సుందరిగా పేరు గాంచిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె కొన్ని సినిమాలకు సహా నిర్మాతగా చేసి, కోట్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.
4.విజయశాంతి :
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బాలయ్య హీరోగా నటించిన నిప్పురవ్వ సినిమాకి సహా నిర్మాతగా చేసి, భారీగా నష్టపోయింది.
Ads
5.రోజా :
హీరోయిన్ రోజా భర్త సెల్వమణి డైరెక్షన్ చేసిన ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించడంతో భారీగా నష్టపోయనని ఇక ఇంటర్వ్యూలో తెలిపింది.
6.భూమిక :
ఖుషి, ఒక్కడు సినిమాలతో అగ్ర నటిగా మారిన భూమిక, తకిట తకిట అనే సినిమాను రెండు కోట్ల బడ్జెట్ లో నిర్మించి నష్టపోయింది.
7.కళ్యాణి :
హీరోయిన్ కళ్యాణి K2K ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను మొదలుపెట్టి ద్విభాషా సినిమాని నిర్మించింది. ఈ సినిమా వల్ల చాలా నష్టపోయింది.8.మంజుల ఘట్టమనేని :
సూపర్ స్టార్ కుమార్తె మంజుల ‘షో’ సినిమాలో హీరోయిన్ గా నటించి,నిర్మించింది. ఆ తరువాత తర్వాత తమ్ముడు మహేష్ తో నాని, కావ్యాస్ డైరీస్ అనే సినిమాలను నిర్మించగా, అవి భారీ నష్టాలను మిగిల్చాయి.9.ఛార్మి :
హీరోయిన్ ఛార్మి నటన నుండి నిర్మాణం రంగంలోకి వెళ్ళి, మెహబూబా, పైసా వసూల్, లైగర్ వంటి సినిమాలను నిర్మించి కోట్లలో నష్టపోయింది.10.సుప్రియ యార్లగడ్డ :
అక్కినేని మనవరాలు సుప్రియ పవన్ కళ్యాణ్ తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించింది. రాజ్ తరుణ్ తో ‘అనుభవించు రాజా’ సినిమాను నిర్మించి నష్టపోయింది.
Also Read: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన 9 రీమేక్ సినిమాలు ఏమిటో తెలుసా?