పూరి జగన్నాథ్ తొలి సినిమా ‘బద్రి’ గురించి ఆసక్తికర విషయాలు..

Ads

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన సినిమా బద్రి. టి.త్రివిక్రమరావు విజయలక్ష్మి ఆర్ట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు.

Ads

ఏప్రిల్ 20న 2000 వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. దాదాపు ఈ సినిమా విడుదలై ఇరవైరెండు ఏళ్ళు అవుతోంది. ఈ సినిమాతోనే పూరి జగన్నాథ్ దర్శకుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. అంటే పూరీ కూడా దర్శకుడిగా 22 ఏళ్లు పూర్తి చేశాడు. ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. దాంతో బద్రి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి రమణ గోగుల సంగీతం అందిచారు.
ఇక బద్రి సినిమా పాటలన్నీ కూడా సూపర్ హిట్ అవడం వల్ల పవన్ ఫ్యాన్స్ ఆశలకు హద్దే లేదనట్లుగా పరిస్థితి నెలకొంది.ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తొలి షోతోనే ప్లాప్ అన్నా టాక్ వచ్చింది. దీంతో పూరి జగన్నాథ్ బాగా నిరుత్సాహ పడ్డారంట. తొలి సినిమానే ప్లాప్ టాక్ వచ్చిందేంటి అని చాలా బాధపడ్డారంట.అయితే ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ కి సన్నిహితుడైన గాయకుడు రఘు కుంచె ఒక సందర్భంలో తెలిపారు. రఘు మాట్లాడుతూ బద్రి సినిమాకి తొలి రోజే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, ఆ సమయంలో ఫిలింనగర్ లో బద్రి సినిమాకి ఓ ఆఫీస్ ఉండేదని, నేను సాయంత్రం అక్కడికి వెళ్ళేప్పటికి పూరి జగన్నాథ్ కింద కుర్చుని బాధపడుతూ ఉన్నాడట.ఎంతో కష్టపడి తీసిన కలల సినిమా తీస్తే ఇలా అయ్యిందని చెప్పి చాలా బాధపడ్డాడని, కానీ సెకండ్ డే నుంచి ఈ సినిమా నెగెటివ్ కాస్తా పాజిటివ్ టాక్ గా మారింది. ఇక మూడవ రోజు నుండి హిట్ టాక్ తో 200 రోజులు ఆడింది అని ఆ సినిమా గురించి చెప్పాడు రఘు కుంచె. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చాలా సినిమాలకి రఘు కుంచె సంగీతం అందించారు. ఆయన ప్రస్తుతం సింగర్ గా పాటలు కొనసాగుతూనే, విలన్ పాత్రలలో నటిస్తున్నాడు.
Also Read: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన 9 రీమేక్ సినిమాలు ఏమిటో తెలుసా?

Previous articleనిర్మాతలుగా మరి భారీగా నష్టపోయిన 10 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?
Next articleప్రాణ మిత్రులు అయినా ఈ 5 విషయాలు అస్సలు చెప్పకండి..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.