Ads
ఈ మధ్యకాలంలో కాపీ చేయడం అనేది సాధారణ విషయం అయిపోయింది. ఇతర భాష సినిమాలను చూసి, వాటిని అలాగే అనుసరించడం అనేది సినిమా వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. సినిమాలను తెరకెక్కించే క్రమంలో సినిమా సబ్జెక్ట్ ను కానీ, సన్నివేశాలను కానీ హాలీవుడ్ చిత్రాల నుండి కాపీ చేస్తుంటారు. అయితే కొన్నేళ్ళ క్రితం వరకు కూడా సినిమా చూసిన వారికి ఎక్కడ నుండి కాపీ కొట్టారనే విషయం అంతగా తెలిసేది కాదు.
కానీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎప్పుడైతే అందరికి అందుబాటులోకి వచ్చాయో, ఇక అప్పటి నుండి అర్దం కాకున్నా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి ఇతర భాష సినిమాలు చూస్తున్నారు. దాంతో ఏ సినిమాల నుండి ఏ సన్నివేశాలను, కంటెంట్ ను కాపీ చేశారనే విషయలు తెలిసిపోతున్నాయి. ఇక హాలీవుడ్ సినిమాలు సహజంగానే అందరినీ ఆకట్టుకుంటాయి. దాంతో ఆ సినిమాలను ఆదర్శంగా తీసుకుని తెలుగు పరిశ్రమలో కొన్ని కాపీ సినిమాలు తెరకెక్కించారు. ఇంకా దానిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలో హాలీవుడ్ సినిమాల పోస్టర్లు కూడా తెలుగు సినిమాల కోసం కాపీ కొడుతున్నారు. మరి అలా హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేసి డిజైన్ చేసిన 11 తెలుగు సినిమా పోస్టర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1.కబాలి – టిక్టిక్: ది అస్వాంగ్ క్రానికల్స్2. బాహుబలి ది బిగినింగ్ – సైమన్ బిర్చ్
Ads
3. రోబో 2.0 – హ్యారీ పొట్టర్ : ఇట్ ఆల్ ఎండ్స్4. బాహుబలి2 – ONG BAK 2 మరియు XXX xander కేజ్ రిటర్న్స్5. ధృవ – ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ6.తుపాకి – ఎన్ ఆఫీసర్ అండ్ జెంటిల్ మెన్.7. సాహో – బ్లేడ్ రన్నర్.8. అఖిల్ – ది డ్రాగన్ బాల్9. విశ్వరూపం – మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రోటోకాల్10. యు టర్న్ – కొలేటరల్ బ్యూటీ
11. ఎవెంజర్స్ – ఆదిపురుష్
Also Read: నయనతార టు హన్సిక.. ముప్పై వస్తేనే కానీ ఈ 8 మంది హీరోయిన్స్ వివాహం చేసుకోలేదు..!