Ads
సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక మాయాలోకం లాంటిది. వెండితెర పై కొన్నేళ్ళ పాటు స్టార్ స్టేటస్ అనుభవించిన నటీనటులు హఠాత్తుగా కనుమరుగు అవుతూ ఉంటారు. ప్రేక్షకులు తమకు నచ్చిన నటీనటులను ఎంతగా అభిమానిస్తారో అందరికి తెలిసిందే.
నచ్చనపుడు కూడా అంతే తేలికగా పక్కన పెట్టేస్తారు కూడా. ఇక ఇలా బాధితులైన నటీనటులు చాలా మందే ఉన్నారు. సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస హిట్స్ ఇస్తూ, విజయాలు పొంది ప్రేక్షకుల అభిమానాన్ని పొంది కూడా సడెన్ గా కనుమరుగు అయినా వారు ఉన్నారు. తెలుగులో ఒక వెలుగు వెలిగి కనుమరుగు అయిన ఐదుగురు హీరోలు ఎవరో చూద్దాం..
1.తరుణ్
తరుణ్ ఒకప్పుడు అమ్మాయిలకు డ్రీమ్ బాయ్, ఫేవరేట్ హీరోగా నిలిచాడు. అయితే ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. బాలనటుడుగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆయన హీరోగా తొలి సినిమా నువ్వే కావాలి. వేట అనే సినిమా 2014లో చేసి నాలుగేళ్ల పాటు నటించలేదు. ఆ తరువాత 2018లో ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే మూవీలో నటించారు. ఇక ఆ తరువాత తరుణ్ ఏ సినిమాలో కనిపించలేదు.
2.వడ్డె నవీన్
ఒకప్పటి స్టార్ హీరో వడ్డె నవీన్. నిర్మాత వడ్డె రమేష్ కుమారుడు. ఆయన ప్రియా ఓ ప్రియా, పెళ్లి, మా నాన్నకు పెళ్లి, లవ్ స్టోరీ, చాలా బాగుంది లాంటి చాలా చిత్రాల్లో నటించి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను చివరి సారిగా రామ్ గోపాల్ వర్మ తీసిన ఎటాక్ మూవీలో గోపిగా చేసారు. ఆ తరువాత అకస్మాత్తుగా టాలీవుడ్ కి దూరమయ్యాడు.
3.వేణు తొట్టెంపూడి
హీరో వేణు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండేవారు. 1999లో వచ్చిన స్వయంవరం మూవీతో హీరోగా ఎంట్రీ అయ్యి, సక్సెస్ సాధించాడు. ఆ తరువాత హనుమాన్ జంక్షన్, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళ్లితే, లాంటి హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ మధ్యకాలంలో మూవీస్ కి విరామం ఇచ్చారు. ఇటీవల రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీలో నటించాడు.
Ads
4.ఆర్యన్ రాజేష్
ఆర్యన్ రాజేష్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కుమారుడు. మొదటి సినిమా హాయ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎవడిగోల వాడిదే, నువ్వంటే నాకిష్టం, ఆడంతే అదోటైపు, అనుమానాస్పదం చిత్రాలలో నటించాడు. అటు తరువాత సైడ్ క్యారెక్టర్లు కొన్ని చేసారు.
5.తారకరత్న
నందమూరి మరో వారసుడు తారకరత్న. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో పరిచయం అయ్యి, యువరత్న, భద్రాద్రి రాముడు, తారక్ లాంటి చాలా సినిమాల్లో నటించి కూడా ప్రేక్షకాదరణ పొందలేక పోయాడు. అమరావతి మూవీలో విలన్ గా చేసి, నంది అవార్డు కూడా అందుకున్నాడు. ప్రేక్షకులు అతనిని హీరోగా చూడలేకపోవడా వల్ల టాలీవుడ్ కి దూరమయ్యాడు.Also Read:ఈ ఏడాది విడుదల అయిన మల్టీ స్టారర్ సినిమాలు.. ఎన్ని హిట్ కొట్టాయంటే?