ఇంటర్వ్యూ లో సక్సెస్ అవ్వాలంటే.. ఈ 6 విషయాలని మరచిపోవద్దు..!

Ads

ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ని ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూలో గెలుపొందితే తప్ప ఉద్యోగం రాదు. చాలామంది రాతపరీక్ష మొదలైన వాటిల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చే సరికి ఏదో చిన్న చిన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం ఇతర కారణాల వలన ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు. క్వాలిఫై అవ్వలేకపోతూ ఉంటారు.

నిజానికి ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూ అనేది కీలకమైనది. ఇంటర్వ్యూ లో సక్సెస్ ని పొందాలంటే కచ్చితంగా కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు గుర్తు పెట్టుకున్నారంటే కచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ పొందగలరు.

#1. మంచి పదాలని వాడండి:

ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు మంచి పదాలను ఉపయోగించి జవాబు ఇవ్వండి ఇలా చెప్పడం వలన మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది.

#2. కమ్యూనికేషన్:

Ads

కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ బట్టి ఎంపిక చేస్తూ ఉంటారు. మీ బాడీ లాంగ్వేజ్ వంటివి జాగ్రత్తగా చూసుకోండి.

#3. బాగా వినండి:

మీరు బాగా వింటే మంచిగా సక్సెస్ పొందడానికి అవుతుంది. మీరు బాగా వింటే మీరు బాగా చెప్పగలరు. లేకపోతే కష్టం.

#4. వేసుకునే దుస్తులు:

మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు క్యాజువల్ గా ఉండే వాటిని మాత్రమే ధరించండి. మీరు ఇంటర్వ్యూ కి వెళ్లే కంపెనీని బట్టి మీ బట్టలు ఉండాలి.

#5. ఆత్మవిశ్వాసం:

ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం అలానే మీ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ని కూడా మీరు ఎక్కువ ఉంచుకోకండి.

#6. ఎక్కువ మాట్లాడకండి:

అడిగిన వాటికి మాత్రమే జవాబు చెప్పండి అతిగా మాట్లాడి చాలా మంది మార్కులని కోల్పోతూ ఉంటారు. ఈ విషయాలని మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు దృష్టి లో పెట్టుకుంటే కచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వచ్చు.

Previous articleతెలుగులో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి కనుమరుగైన 5 గురు హీరోలు..
Next articleఅత్యధిక కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడిన టాప్ 10 మూవీస్ లిస్ట్..!