స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంట్లో నుండే గంటకి 400 సంపాదిస్తున్న భారత మహిళ.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఏమన్నారంటే..?

Ads

ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ఓ సంచలనం అని చెప్పవచ్చు. దాని ప్రభావం అన్ని రంగాలలో ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫోన్‌లో పంపే మెసేజ్ నుండి అంతరిక్షంలోకి పంపే రాకెట్‌ వరకు అన్ని చోట్లా ఏఐ పాత్ర కనిపిస్తున్నది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు అని వినిపిస్తోండగా, కొందరు ఏఐను ఉపయోగించి, ఆదాయాన్ని పొందుతున్నారు. చిన్న వ్యాపారం చేసే, పుణెకు చెందిన 53 ఏళ్ళ మహిళ గంటకి 400 సంపాదిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మహారాష్ట్రలోని ఖరాడీకి చెందిన 53 ఏళ్ల మహిళ బేబీ రాజారామ్ బోకాలే మసాలా దినుసులు మరియు మిరపకాయల గ్రైండింగ్ చేసే చిన్న వ్యాపారంతో తన ఇంటిని నడుపుకుంటున్నారు. ఆమె మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్స్‌కు తన వాయిస్ ను అరువు ఇస్తూ ఆదాయాన్ని పొందుతోంది. మరాఠీ నేర్పిస్తూ గంటకు రూ.400 అందుకుంటున్నారు. 11 రోజులకు గాను 2వేల రూపాయలు సంపాదిస్తోంది. పగటిపూట ఆమె పనులన్నీ అయిన తరువాత ఏఐ మోడల్స్‌ కోసం బేబీ మరాఠీలో స్టోరీలు చదువుతుంది.

సేవింగ్స్, బ్యాంకింగ్, ఫ్రాడ్‌ ప్రివెన్షన్లకు సంబంధించిన స్టోరీలను ఇన్‌ఫర్‌మేటివ్ మరియు ఎంటర్‌టైనింగ్‌ పద్ధతిలో రూపొదించారు. ఆమె మాట్లాడుతూ “నా వాయిస్ రికార్డ్ చేయబడుతున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను, మరియు నా వాయిస్‌ ద్వారా మరాఠీ నేర్చుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. మరాఠీలో ఏఐ టూల్స్, ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఇలా సంపాదించిన డబ్బుతో నా గ్రైండర్‌ను రిపేర్ చేయడానికి ఉపయోగించాను” అని చెప్పుకొచ్చారు.

Ads

మైక్రోసాఫ్ట్‌ సీయీవో సత్య నాదెళ్ల భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో సోషల్‌ ఇంపాక్ట్‌ ఆర్గనైజేషన్‌ ‘కార్య’ టీమ్‌ లాంటి సంస్థతో కలిసి పని చేయడానికి ఉత్సాహం చూపారు. 2017లో బెంగళూరు కేంద్రంగా మైక్రోసాఫ్ట్‌ రిసెర్చి ప్రాజెక్ట్‌గా ‘కార్య’ ప్రారంభం అయ్యింది. “ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి, పరిశోధనల కోసం పలు భారతీయ భాషలలో అధిక-నాణ్యత గల డేటాసెట్లను క్రియేట్‌ చేస్తోంది. డేటాసెట్‌లను రూపొందించడంలో మరియు అదే సమయంలో ఆర్థిక అవకాశాలను విస్తరించడంలో కీలకమైన పనిని చేస్తున్న కార్యాలోని బృందాన్ని కలవడానికి ఈ వారం భారత్‌కు రావడం చాలా బాగుంది” అంటూ సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు.

Also Read: హైదరాబాద్ లో 29 రూపాయల భారత్ రైస్ అమ్మే ఏరియాలు ఏవో తెలుసా..?

 

 

Previous articleసినిమాలు లేకపోయినా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోజ్..ఎలాగంటే.? ఆమె క్రేజ్ అలాంటిది మరి!
Next articleఈరోజుల్లో పెళ్లిళ్లు ఇలాగే ఉన్నాయా? అమ్మాయిలందరూ ఇలానే చేస్తే అబ్బాయిల పరిస్థితి ఏంటి?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.