Ads
ఒకప్పుడు పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని చెప్తూ ఉండేవారు. అంటే.. అన్ని తరాల వ్యక్తులను చూసి పెళ్లి చేయాలనీ అర్ధం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆరంకెల జీతం ఉందా? ఎంత ఆస్తి ఉంది అన్న విషయాలను చూసి పెళ్లి చేస్తున్నారు.
ఇక అమ్మాయిలు తక్కువ సంఖ్యలో ఉండడంతో.. పెళ్ళికి వారి డిమాండ్లు కూడా తక్కువగా ఏమీ లేవు. అన్ని కుదిరి పెళ్లి పీటలు ఎక్కడానికి చాలా సమయం పడుతోంది. ఓ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలంటే అబ్బాయికి చాలా క్వాలిటీస్ ఉండాల్సిన పరిస్థితి క్రమంగా ఏర్పడుతోంది.
పూజారులకు, పురోహితులకు పిల్ల దొరకడమే గగనం అయిపోతుంది. సినిమా రంగంలో పని చేసేవాళ్ళకి కూడా పిల్లని ఇవ్వడం లేదు. ఈ మధ్య మీడియాలో పని చేస్తున్న వారికి పెళ్లి సంబంధాలు త్వరగా కుదరట్లేదు. ఇక గ్రాడ్యుయేట్ అయితే.. ఆ చదువు సరిపోదని పిల్లని ఇవ్వట్లేదు. అమ్మాయిని ఇవ్వాలంటే.. పెళ్లి చేసుకునే అబ్బాయికి కనీసం అరవై వేలకి పైగా జీతం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటె.. ఏమి సరిపోతుంది? మేము పిల్లని ఇవ్వము అని చెప్పేస్తున్నారు.
Ads
ఇక జాయింట్ ఫ్యామిలీల స్టోరీ వేరే ఉంది. అత్తమామలతో కలిసి ఉండడానికి ఈరోజుల్లో ఏ అమ్మాయి ఇష్టపడడం లేదు. అబ్బాయి అందంగా లేకపోయినా… అమ్మాయి ఒప్పుకోలేదని సింపుల్ గా చెప్పేస్తారు. వయసు తేడా రెండేళ్ల కంటే ఎక్కువ ఉండడానికి ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇవ్వన్నీ ఎలాగో కుదిరాయి..
పెళ్లి కి ఒప్పుకుంటారా అని ఎదురు చూస్తే.. అన్నిటికంటే పెద్ద బ్రహ్మాస్త్రం జాతకాలూ కలవలేదు అని చెప్పేస్తారు. దీనితో, పెళ్లి కానీ ప్రసాదులు ఎక్కువయిపోయారు. ఇలా చిన్న చిన్న కారణాలతో పెళ్ళికి నో చెప్పేస్తూ ఉంటె.. అబ్బాయిలకు సంబంధాలు ఎలా కుదరాలి? ఎప్పటికి కుదరాలి? అన్న చర్చ మొదలవుతోంది. మరో వైపు కొందరు అసలు పెళ్లి బంధం పైనే ఆసక్తి వదిలేసుకుంటున్నారు.
featured image credits: a screenshot from “Sannayi” Telugu Short Film