Ads
మల్లేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు రాజ్ రాచకొండ. ఇప్పుడు ఆయన హిందీలో ఒక సినిమా రూపొందించారు. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా అని అంటున్నారు. ఈ సినిమా పేరు 8 ఏఎం మెట్రో. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన అందమైన జీవితం నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇరావతి (సయామీ ఖేర్) భర్త, పిల్లలతో కలిసి నాందేడ్‌లో ఉంటుంది.
Ads
ఒకరోజు తన చెల్లెలు నుండి ఫోన్ వస్తుంది. ఆమె హైదరాబాద్ లో ఉంటుంది. ఆమెకి ఆరోగ్య సమస్య రావడంతో ఇరావతి హైదరాబాద్ కి వస్తుంది. హాస్పిటల్ నుండి చెల్లెలి ఇంటికి వెళ్లడానికి మెట్రో ఎక్కాల్సి వస్తుంది.. అక్కడ భయంతో చెమటలు పడుతూ ఉండడంతో, ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) ఆమెకి వాటర్ బాటిల్ ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ స్నేహితులు అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమాలో తెలుగు నటీనటులు చాలా మంది ఉంటారు. ఒక తెలుగు డైరెక్టర్ హిందీలో సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. ఇటీవల చాలా మంది తెలుగు డైరెక్టర్లు హిందీలో తమ సత్తా చాటుతున్నారు.
ఇప్పుడు రాజ్ రాచకొండ కూడా చాలా మంచి సినిమాని హిందీలో రూపొందించారు. ఈ సినిమా జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఎమోషన్స్ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమాని ముందుకు నడిపించిన తీరు చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఒక మనిషిలో చాలా ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళు బయటికి చాలా మామూలుగా కనిపిస్తారు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో చూపించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా ఉన్నా కూడా, చాలా మంచి సినిమా అని ఈ సినిమా చూసిన వాళ్లు అందరూ కామెంట్స్ చేస్తున్నారు.