Ads
గత సంవత్సరం నవంబర్ 11న దీపావళి పేరుతో తెలుగులో విడుదలైన తమిళ సినిమా కిడ. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో చిత్రోత్సవాల్లో ప్రదర్శించి అవార్డులు కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా.
భావోద్వేగాలతో కూడుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం అలరించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది.
తాతకి, మనవడికి, మేకకి మధ్య ఉన్న అనుబంధాన్ని సినిమాగా తీశారు డైరెక్టర్ ఆర్ ఏ వెంకట్. మనవడు దీపావళికి బట్టలు కొనమంటే చేతిలో డబ్బులు లేక పెంచుకుంటున్న మేకని అమ్మి మనవడికి బట్టలు కొందామనుకుంటాడు ఆ తాత. అయితే దేవుడు మొక్కు ఉన్న ఆ మేకని కొనటానికి ఎవరు ఇష్టపడరు. తాత మేక ని అమ్ముతున్నాడని తెలుసుకొని తనకి డ్రెస్ వద్దని మేక కావాలని మనవడు అడగటం..
Ads
డబ్బులు దొరక్క ఇంటికి వెళ్లకుండా ఊరి చివర తాతయ్య వెయిట్ చేయడం.. ఇవన్నీ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. టాలీవుడ్ సీనియర్ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాని తొలిసారిగా తమిళంలో నిర్మించారు తర్వాత తెలుగులోకి డబ్ చేశారు. అయితే థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా ఈ అవార్డు విన్నింగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుంది.
గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమాలో రాము, కాళీ వెంకట్, దీపక్, పాండియమ్మ,విజయలక్ష్మి, కమలి తదితరులు ప్రధానపాత్రలు పోషించగా థీసన్ మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. ఈ సినిమా తెలుగులో బలగం సినిమాని గుర్తుకొచ్చేలా చేస్తుంది. రెండు సినిమాలలో బలమైన కుటుంబ బంధాలు భావోద్వేగాలు ఉండడం గమనార్హం. ఇక సిల్వర్ స్క్రీన్ మీద అలరించిన ఈ సినిమా ఓటీటీ లో కూడా అలరించాలని కోరుకుందాం.