టాలీవుడ్ లో కులాంత‌ర వివాహాలు చేసుకున్న 8 మంది హీరోలు ఎవరో తెలుసా?

Ads

తెలుగు సినీ పరిశ్రమ తొలి రోజుల్లో ఎలా ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం కులాన్ని బట్టి హీరోను అభిమానించే అభిమానులు ఎక్కువైపోతున్నారు.

Ads

అయితే హీరోలు కులాల కోసం అభిమానులు పొటలాడుకోవద్దని, ప్రతీ హీరో అందరూ ఒకటేనని అవకాశం ఉన్న ప్రతిసారి చెబుతున్నా, ఇది మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్‌ హీరోలు కొందరు మాత్రం కులాంతర వివాహాలు చేసుకున్నారు. ఇంతకి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..1.అక్కినేని నాగార్జున – అమల
అక్కినేని నాగార్జున ఆరుపదుల వయసులోనూ యంగ్ గా కనిపిస్తున్నాడు. అలాంటి నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కిరాయి దాదా మూవీ టైమ్ లో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత నాగేశ్వర రావు అనుమతితో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ అమల నార్త్ ఇండియన్, తెలుగు సంప్రదాయంలోనే వారి పెళ్లి జరిగింది.2. శ్రీకాంత్ – ఊహ
శ్రీకాంత్, ఊహ కలసి నటించిన ఆమె సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమలో పడి,పెళ్లి చేసుకున్నారు.3.మహేష్ బాబు – నమ్రతా శిరోద్కర్
మహేష్ బాబు అమ్మాయిల కలల రాజకుమారుడు. అలాంటి మహేష్ ని కూడా ప్రేమించేలా చేసింది నమ్రత శిరోద్కర్. నమ్రతనార్త్ ఇండియన్, ఇంట్లో వారిని ఒప్పించి నమ్రతని వివాహం చేసుకున్నాడు.4.రామ్ చరణ్ – ఉపాసన
మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా, టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న రామ్ చరణ్ ఎవరిని వివాహం చేసుకుంటాడని అందరిలోను ఆసక్తి ఉండేది.ఆ టైమ్ చరణ్ ప్రేమ పెళ్లికే ప్రాధాన్యత ఇచ్చి, కులాంతర వివాహం చేసుకున్నాడు. చిన్ననాటి ఫ్రెండ్ ఉపాసన కామినేనిని పెళ్లి చేసుకున్నాడు.5.అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కులాంతర వివాహం చేసుకుంటాడు. స్నేహ రెడ్డిని ప్రేమించి, తన తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.6. నాగ చైతన్య – సమంత
తండ్రి నాగార్జునకి తెలికుండా నాగ చైతన్య సమంతతో రహస్య ప్రేమ కథ నడిపి, చివరికి రెండు కుటుంబాలను ఒప్పించి గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక వీళ్ళ కులంతో పాటూ మతాలు కూడా వేరు అవడంతో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.7. మంచు విష్ణు :
మంచు విష్ణు విరోనికను ప్రేమించి, మోహన్ బాబు ను ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరిదీ కులాంతర వివాహమే.8. మంచు మనోజ్
అన్న లాగే తమ్ముడు మనోజ్ కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. చూడడానికి సీరియస్ గా కనిపించే మోహన్ బాబుని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

Also Read: పవన్ హీరోయిన్ ‘లవ్ లీ’.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Previous articleత‌మ‌ కంటే చిన్నవాళ్ల‌ను పెళ్లి చేసుకున్న 6 హీరోయిన్స్ !
Next articleమహేష్ బాబు మామగారు.. నమ్రత తండ్రి.. స్టార్ క్రికెటర్ అని తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.