మహేష్ బాబు మామగారు.. నమ్రత తండ్రి.. స్టార్ క్రికెటర్ అని తెలుసా?

Ads

మహేష్ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్ అయిన నమ్రత వివాహం తరువాత సినిమాలకి దూరం అయ్యింది. తాజాగా నమ్రత గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అది ఏమిటో చూద్దాం..

Ads

తెలుగు సినీపరిశ్రమలో ఈ తరం హీరోలలో ఎవరు సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు అనే చెప్పాలి. మహేష్ నటన,హోదా, ఇలా అన్ని కూడా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుండి వారసత్వంగా పొంది. వాటిని అనుసరిస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. ఎంతగా ఎదిగిన కూడా ఒదిగి ఉండాలనే విషయం మహేష్ బాబుని చూస్తే తెలుస్తుంది. మహేష్ భార్య నమ్రత మిస్ ఇండియాగా కిరీటం అందుకుని, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న బాలీవుడ్ అగ్ర నటి నమ్రత శిరోద్కర్ మహేష్ లో ఉండే మంచి లక్షణాలను చూసే, కోరి మరీ వివాహం చేసుకుంది. అయితే మహేష్ బాబుకి నమ్రతలో ఉండే వినయ విధేయతలు నచ్చాయి. ఆమె చిన్న పెద్ద తేడా చూడకుండా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఒక సందర్భంలో నమ్రత లాంటి అమ్మాయి తనకు కుమార్తె అయితే చాలా బాగుండేది అని చెప్పాడు. నమ్రత మరాఠీ అమ్మాయి. ఆమె జనవరి 22న 1972 లో ముంబై లో జన్మించింది. నమ్రత తండ్రి పేరు నితిన్ శిరోద్కర్. ఆ సమయంలో ఆయన స్టార్ క్రికెటర్. ఆయన పూర్తి పేరు నితిన్ పాండురంగ శిరోద్కర్. ముంబై జట్టుకి దేశవాళి ఆటగాడు ఉన్నాడు. క్రికెట్ లో నితిన్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. పైగా సునీల్ గ‌వాస్క‌ర్, దిలీప్ వెంగాసర్కార్ వంటి పెద్ద ఆటగాళ్ల తో ఆడేవారట. ఇది నిజంగా గొప్ప విషయమే. క్రికెట్ లో ఆయన మంచి బౌలర్. చాలా మంది ఆయన ఆట ని చూసి షాక్ అయ్యేవారట. నితిన్ తన కెరీర్ లో ఫాస్ట్ బౌలర్ గా ఎదిగాడు. ప్రమాదకరమైన బౌలర్ గా అని చెప్పుకొనేవారు.

Also Read: సీనియర్ ఎన్టీఆర్ నుండి అడివి శేష్ వరకు.. టాలీవుడ్ హీరోలు ఏం చదివారో తెలుసా?

Previous articleటాలీవుడ్ లో కులాంత‌ర వివాహాలు చేసుకున్న 8 మంది హీరోలు ఎవరో తెలుసా?
Next articleఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన 10 డబ్బింగ్ సినిమాలు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.