తుఫాన్ల కి పేర్లు ఎలా పెడతారు..? దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

Ads

అప్పుడప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి. తుఫాన్ల వలన ఎంతో నష్టపోతూ ఉంటాము. అయితే తుఫాన్ లని పిలిచేటప్పుడు వాటికి కొన్ని పేర్లు పెడుతూ ఉంటారు. నైలా తుఫాన్ అని హుదూద్ అని ఇలా రకరకాల పేర్లు ని ఇప్పటికే మనం చూసాము. అయితే తుఫాన్లకి ఎందుకు ఇలా పేర్లు పెడతారు..? అసలు ఎవరు పెడతారు.. ఎలా ఈ పేర్లను ఫిక్స్ చేస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం..

నిజానికి చాలామందిలో ఈ సందేహం ఉంటుంది. తుఫాన్లకి ఆ పేరు ఎలా వచ్చిందని.. మరి మీకు కూడా ఈ సందేహం ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి.. ఎప్పుడైనా ఏదైనా తుఫాన్ కి పేరు పెడితే ఆ పేరుతోనే మనం సంబోధిస్తూ ఉంటాము. ఆ తుఫాను వచ్చేస్తుంది అని న్యూస్ చానల్స్ లో కూడా చెప్తూ ఉంటారు. పేపర్లలో కూడా ఆ పేరుతోనే ఆ తుఫాన్ కు సంబంధించిన అప్డేట్స్ ని ఇస్తూ ఉంటారు.

Ads

తుఫాన్ కి పేరు పెట్టడం వలన మనకి సులభంగా అర్థమవుతుంది. తుఫాన్ కి కనుక పేరు లేదంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో కూడా ఆ తుఫాన్ గురించి చెప్పడానికి గజిబిజి గా ఉంటుంది. అదే పేరు ఉందంటే ఓహో అలా జరిగింది కదా అని అందరికీ అర్థమవుతుంది. క్లియర్ గా ఉంటుంది.

అయితే అందుకోసం 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో నార్త్ ఇండియన్ ఓషన్ జోన్ లో ఉంటున్న ఇండియా తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మైనమార్, ఓమన్ ఇలా ఎనిమిది దేశాలు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ప్రతి దేశం కూడా వాళ్ల తరపున ఎనిమిది పేర్లను ఇచ్చాయి.

ఒక్కో దేశం 8 పేర్లని అంటే మొత్తం 64 పేర్లను ఎనిమిది దేశాలు కలిపి ఇచ్చాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో దేశాలు ఇచ్చిన పేర్లను అరేంజ్ చేశారు వచ్చే తుఫాన్లకి ఒక్కొక్కటిగా ఆ పేర్లను పెట్టాలని అనుకున్నాయి. పదేళ్లకి ఒకసారి ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేసి పేర్లను సేకరిస్తాయి ఇలా తుఫాన్లకి పేర్లు పెడతారు.

Previous articleపెళ్లి అయిన తరువాత లెగ్గింగ్స్, జీన్స్ వేసుకుంటే ఈ ఇబ్బందులు ఉంటాయి..!
Next articleమహేంద్ర సింగ్ ధోని ఆఖరి IPL ఇదేనా..? ఇక క్రికెట్ కి దూరం అయినట్టేనా..?