మహేంద్ర సింగ్ ధోని ఆఖరి IPL ఇదేనా..? ఇక క్రికెట్ కి దూరం అయినట్టేనా..?

Ads

ఈసారి ఐపీఎల్ సీజన్ లో చెన్నై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఇది ధోని ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద గుడ్ న్యూస్. కానీ మహేంద్రసింగ్ ధోని ఇక నుండి క్రికెట్ ఆడడా…. ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఆడడా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ధోనిని మళ్లీ గ్రౌండ్లో చూడగలమా లేదా అని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ధోని ఇక ఐపీఎల్ లో చూడలేమేమో అని అనుకుంటున్నారు.

మోకాలు నొప్పితో ధోని బాధపడుతున్న విషయం తెలిసిందే. ధోని మోకాలు సర్జరీకి సంబంధించిన రిపోర్టులు ఏమంటున్నాయి.. రిపోర్టులు వచ్చాయా అనే ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… భారత మాజీ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మోకాలు నొప్పితో బాధ పడుతున్న విషయం తెలిసిందే.

Ads

దానితో పాటుగా ఇతర గాయాలతో కూడా ధోని బాధపడుతున్నాడు. ముంబై లోని కోకిలాబెన్ హాస్పిటల్ లో ధోని షేర్ చేసిన టెస్టులు కూడా చేయించుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో మోకాలు నొప్పితోనే ధోని ఆడటం జరిగిందే. మోకళ్ళకి క్యాప్ ని ధరించి ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎడమ మోకాళ్ళకి అయితే ధోని ఐస్ ప్యాక్ లు పెట్టుకుని ఫైనల్ మ్యాచ్ ఆడాడు.

ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోకాలి గాయం తో బాధపడుతున్న ధోని ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ లో కనపడడు. ఇదే చివరిసారి అని అంతా భావిస్తున్నారు. పైగా ధోని కూడా రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే మంచి సమయం అని కూడా చెప్పాడు. కానీ అభిమానులకి తనపై ఉండే ప్రేమను చూస్తే మరో ఐపీఎల్ ఆడాలని అనిపిస్తున్నట్లు ధోని చెప్పాడు.

అయితే తన మోకాళ్ళ పరిస్థితిని బట్టి డిసెంబర్లో నిర్ణయం తీసుకోనున్నాడు ధోని. ప్రస్తుతం అయితే కేవలం కోకిలాబెన్ ఆసుపత్రి లో టెస్టులు చేయించుకుంటాడని మాత్రమే తెలుస్తుంది. సర్జరీ చేస్తారా లేదా చేయించుకుంటాడా లేదా అనే దాని మీద ఇంత స్పష్టత లేదు.

Previous articleతుఫాన్ల కి పేర్లు ఎలా పెడతారు..? దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
Next articleఏసీబీ రైడ్స్ జరిగినప్పుడు.. పింక్ రంగులో వుండే ఈ సీసాలని ఎందుకు పెడతారు..?