Ahimsa movie review: అహింస మూవీ హిట్టా..?, ఫట్టా..?

Ads

అహింస ప్రేమ‌క‌థ సినిమా. దగ్గుబాటి అభిరామ్, గీతికా, సముద్రఖని, రజత్‌ బేడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ. కిర‌ణ్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు.

సినిమా: అహింస
నటీనటులు : దగ్గుబాటి అభిరామ్, గీతికా, సముద్రఖని, రజత్‌ బేడి తదితరులు
దర్శకత్వం : తేజ
నిర్మాత : పీ. కిర‌ణ్
సంగీతం : ఆర్ పి పట్నాయక్
విడుదల తేదీ : 02, జూన్ 2023

స్టోరీ :

రఘు (అభిరామ్ దగ్గుబాటి) ఊళ్ళోనే ఉండి పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. తన మరదలినే రఘు లవ్ చేస్తాడు. అయితే కొన్ని అనుకోని కారణాల చేత రఘుకి కొంత మంది వ్యక్తులతో గొడవ అవుతుంది. దీనితో అతని పొలం ఇబ్బందుల్లో పడిపోతుంది.

రఘు మరదలిని కిడ్నాప్ చేస్తారు కూడా. అయితే మరి రఘుని ఇలా ఎవరు ఇబ్బంది పెట్టారు..? పొలం తిరిగి తెచ్చుకున్నాడా..? ఎలా ఈ సమస్యని ఎదుర్కొంటాడు..? రఘు మరదలికి ఏం అవుతుంది.. ? రఘు ఈ సమస్యల నుండి బయటపడ్డాడా లేదా అనేది సినిమాని చూసి తెలుసుకోండి.

రివ్యూ:

Ads

డైరెక్టర్ తేజ ఎప్పుడు కూడా రొటీన్ గా కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పటికే చాలా మంది హీరోలకి స్టార్లు గా తేజా గుర్తింపు ని తీసుకు వచ్చారు. ఇప్పుడు తేజా అభిరామ్ దగ్గుబాటిని అహింస తో ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరో ఒక వ్యక్తి, అతను ఎదుర్కొన్న సమస్యల గురించి చూపించారు.

స్టోరీ అలానే మూవీ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంది. కథ ముందుకి వెళ్లే కొద్దీ సస్పెన్స్ అనేది పెరిగింది. ప్రతీ సీన్ ని కూడా కొత్తగా చూపారు. నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా న్యాయం చేసారు. ఏ లోటూ లేదు. హీరోయిన్ తన పాత్ర పరిధికి నటించింది. స్ట్రాంగ్ మెసేజ్ తో ఉంది కథ. అయితే కొన్ని చోట్ల సీన్స్ కూడా సాగదీసినట్టుగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్:

నటీ, నటులు
కథ
కాన్సెప్ట్
దర్శకత్వం
సస్పెన్స్
సినిమా ఇచ్చే మెసేజ్

మైనస్ పాయింట్స్:

ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్స్
సాగదీత సన్నివేశాలు

రేటింగ్: 2.5/5

Previous articleబయట ఎందుకు మనకి సినిమాల్లో నటులు వేసుకునే బట్టలు కనపడవు..?
Next articleరూ.100 నోటుపై ఉన్న పర్వతం పేరు ఏమిటి..? అసలు ఇది ఎక్కడ వుంది అంటే..?