అనౌన్స్ చేశాక ఆగిపోయిన 7 చిరంజీవి సినిమాలు ఇవే..!

Ads

150కి పైగా సినిమాల్లో నటించి మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని పొందారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి కూడా చాలా మంది హీరోలని తీసుకువచ్చారు. అదే విధంగా ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి రావడం జరిగింది.

అయితే పెద్ద హీరోలకి అయినా చిన్న హీరోలకైనా ఒకసారి సినిమాని అనౌన్స్ చేసిన తర్వాత ఆ సినిమా ఆగిపోయిన సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. సినీ కెరియర్ లో ఇలాంటివి చాలామంది హీరోలు ఎదుర్కొన్నారు. అలానే చిరంజీవి సినిమాలు కూడా అనౌన్స్ చేశాక ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాతో పాటుగా ఏడు చిరంజీవి సినిమాలు ఆగిపోయాయి మరి ఆ సినిమాలో ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భూలోక వీరుడు:

అశ్వినిదత్ నిర్మించాలనుకున్న భూలోక వీరుడు మూవీ ని అనౌన్స్ చేసారు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జానపదంగా ఈ సినిమా ని తీసుకు రావాలని అనుకున్నారు. కానీ స్టోరీ లో తప్పుల వలన మధ్య లో ఆపేసారు.

వినాలని ఉంది:

రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఊర్మిళ, టబులతో రెండు పాటలు అలానే కొంచెం షూటింగ్ కూడా అయింది. భారీ ట్రాఫిక్ జామ్ కాన్సెప్ట్ లో కొన్ని సీన్లను కూడా తీసుకున్నారు. కానీ అర్థాంతరంగా ఆగిపోయింది.

అబు బాగ్దాద్ గజదొంగ:

Ads

ఈ మూవీ కూడా మధ్య లో ఆగిపోయింది. అబు బాగ్దాద్ గజదొంగ సురేష్ కృష్ణ దర్శకత్వంలో రావాలి కానీ కొన్ని రోజులకు మధ్యలోనే ఇది ఆగిపోయింది. దక్షిణాది భాషలతో పాటుగా ప్రత్యేక హాలీవుడ్ చిత్రంగా తీసుకొద్దామనుకున్నారు.

వజ్రాల దొంగ:

చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వజ్రాల దొంగ కూడా ఆగిపోయింది. రామ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాని తీసుకొద్దామనుకున్నారు. పూజా కార్యక్రమం కూడా మొదలైంది. కానీ ఆగిపోయింది.

ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా:

ఎస్ వి కృష్ణారెడ్డి చిరంజీవి తో ఈ సినిమా చేద్దామనుకున్నారు. కానీ ఆగిపోయింది. పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయి. కానీ సినిమా ని ఆపేసారు.

ఆదిత్య సినిమా:

దర్శకుడు ఆదిత్య చిరు తో మూవీ చేయాలనుకున్నారు. కానీ అది కూడా ఆగిపోయింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, కుటుంబ కథలను దర్శకుడు ఆదిత్య ఎంతో బాగా చేసేవారు.

ఆటో జానీ:

రాజకీయాల నుంచి చిరు వచ్చాక ఆటో జానీ మూవీ ని పూరి జగన్నాథ్ చేయాలనుకున్నారు. అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కొన్ని రోజులు ఈ సినిమా గురించి చర్చ సాగింది. ఆగిపోయింది.

 

 

 

Previous articleనువ్వేకావాలి హీరోయిన్ రిచా గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే…?
Next articleVimanam movie review: స‌ముద్రఖ‌ని, అన‌సూయ నటించిన విమానం మూవీ హిట్టా..?, ఫట్టా..?