నువ్వేకావాలి హీరోయిన్ రిచా గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే…?

Ads

నువ్వే కావాలి హీరోయిన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీకు కూడా ఆమె గుర్తుండే ఉంటుంది నువ్వే కావాలి సినిమాలో తరుణ్ సరసన రిచా నటించింది. ఈ సినిమాలో సునీల్ కామెడీ కూడా చాలా బాగుంటుంది, త్రివిక్రమ్ ఎంతో మంచి మాటలని ఇచ్చారు. హీరోగా తరుణ్ హీరోయిన్ గా రిచా పల్లాడ్ అందరిని ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు.

రిచా కి మాత్రం ఈ సినిమా మంచి సక్సెస్ ని ఇవ్వలేదు అయితే ఒకప్పుడు సినిమాల్లో నటించి కొంతకాలం తర్వాత వాళ్ల విషయాలు బయటకి వస్తూ ఉంటాయి. అప్పటివరకు వాళ్ల వివరాలు మనకి తెలియకుండా ఉంటాయి. ఈరోజుల్లో సోషల్ మీడియాలో చాలా మంది నటులు యాక్టివ్ గా ఉంటున్నారు దానితో వారి యొక్క అప్డేట్స్ మనకి తెలుస్తున్నాయి.

తాజాగా రీచా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. పబ్లిక్ లో పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె సినిమాలకు దూరం అయిపోయారు. మంచి సక్సెస్ ని ఇచ్చే పాత్రలోనే నటించారు అయినా కూడా రాను రాను అవకాశాలు తగ్గిపోయాయి. ఈమె బెంగళూరులో పుట్టారు. ఈమె కి ఇతర భాషల మీద కూడా పట్టు బాగా ఉంది. అయితే సినిమాల్లోకి వచ్చిన అంత పెద్ద హీరోయిన్ గా పేరు పొందలేకపోయారు.

Ads

తమిళ్ స్టార్ హీరో విజయ్ తో షాజహాన్ అనే సినిమాలో కూడా ఈమె నటించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. తర్వాత బాలీవుడ్ లో నిక్కీ అనే ఒక సినిమా చేశారు కానీ ఆమె అనుకున్న విధంగా పేరు మాత్రం రాలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తమిళ్ రీమిక్ లో హీరోయిన్ స్నేహితురాలుగా ఈమె నటించింది. చాలా రోజులకి ఇంకోసారి అనే సినిమాల్లో కనబడింది.

కానీ అది కూడా ప్లాప్ అయ్యింది ఏదేమైనా ఈమె కెరియర్ లో అంత సక్సెస్ ని పొందలేకపోయింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఎంత ఎత్తుకు వెళ్తారు అనేది చెప్పలేము. కొందరికి అవకాశాలు వస్తూ ఉంటాయి కొందరికి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఆ తరవాత ఆమె చేసిన రెండు సినిమాలు రిలీజ్ కాలేదు. సినిమాలను ఇక ఆపేసి ఆమె పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు.

Previous article42 ఏళ్ళ నాటి “తిరుమల తిరుపతి” కరపత్రం ని చూసారా..? ఏం వ్రాసి వుంది అంటే..?
Next articleఅనౌన్స్ చేశాక ఆగిపోయిన 7 చిరంజీవి సినిమాలు ఇవే..!