Vimanam movie review: స‌ముద్రఖ‌ని, అన‌సూయ నటించిన విమానం మూవీ హిట్టా..?, ఫట్టా..?

Ads

కోలీవుడ్ యాక్టర్,డైరెక్టర్ సముద్ర ఖని తెలుగు ఆడియెన్స్ కు విల‌న్‌ పాత్రల ద్వారా సుప‌రిచితుడే.సముద్ర ఖని రొటీన్‌కు భిన్నంగా ఈ చిత్రంలో విల‌న్‌గా కాకుండా కొడుకు కోసం బ్రతికే వికలాంగుడైన ఒక తండ్రి క్యారెక్టర్ లో న‌టించిన సినిమా ‘విమానం’.

సినిమా: విమానం
నటీనటులు : స‌ముద్రఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, రాజేంద్ర‌న్ తదితరులు
దర్శకుడు: శివ ప్రసాద్ యానాల
సంగీతం : చరణ్ అర్జున్
నిర్మాణం : జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి
విడుదల తేదీ: జూన్ 9, 2023
స్టోరీ :

వికలాంగుడు అయిన వీరయ్య (సముద్రఖని) భార్య చనిపోవడంతో కొడుకు రాజు (మాస్టర్ ధ్రువన్)ను తానే పెంచుతుంటాడు. వీరయ్య సులభ్ కాంప్లెక్స్ నడుపుతూ చాలి చాలని సంపాదనతో జీవిస్తుంటారు. వీరయ్యకు కొడుకే జీవితం. స్కూల్ కి వెళ్ళే రాజుకు విమానం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ విమానం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పెద్దగా అయ్యాక విమానం ఎక్కాలని కలలు కంటుంటాడు.
కానీ వీరయ్యకు రాజును నెల రోజుల్లోనే విమానం ఎక్కించాల్సి వస్తుంది. కుమారుడి కోరికను వీరయ్య ఎలా తీర్చాడు? ఎందుకు అంత త్వరగా రాజును విమానం ఎక్కించాలని వీరయ్య అనుకుంటాడు? దాని కోసం ఏం చేశాడు. వీరయ్య బస్తీలోనే జీవించే సుమతి (అనసూయ), డేనియల్ (ధనరాజ్), కోటి (రాహుల్ రామకృష్ణ)పాత్రలకు వీరయ్య జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే..
రివ్యూ:

Ads

ఈ చిత్రం తండ్రి కుమారుల మధ్య భావోద్వేగాలతో సాగే కథ మొదలవుతుంది. కొడుకు కోరిక తీర్చడం కోసం తపన పడే తండ్రి లైఫ్ లోని సంఘర్షణలను మనసుకు హత్తుకునే దర్శకుడు తెర పై చూపించాడు. ఫస్టాఫ్‌లో కథ కొంచెం స్లోగా సాగిందనే భావన కలిగినా, ఎమోషనల్ సీన్స్, కంటెంట్‌తో ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా కథనం ఉందని చెప్పవచ్చు. రాజుకు సంబంధించిన సమస్య స్టోరీని మరింత భావోద్వేగంగా మారుస్తుంది. రాహుల్ రామకృష్ణ, అనసూయ ఎపిసోడ్, ధన్ రాజ్ ఫ్యామిలీ సీన్స్ వినోదంగా అనిపిస్తాయి.

ఇక సెకండాఫ్‌లో వీరయ్యకు ఎదురయ్యే సమస్యలు కాస్త సినిమాటిక్‌గా అనిపించినప్పటికి, తరువాత వచ్చే ఎమోషనల్ సీన్స్ లోపాలు కనిపించకుండా చేస్తాయి. రాహుల్ రామకృష్ణ అనసూయ వచ్చే చివరి సీన్ మూవీకి హైలెట్‌. ఆఖరి ఇరవై నిమిషాలు ఆడియెన్స్ ను భావోద్వేగానికి గురిచేస్తుంది.

తండ్రి పాత్ర‌లో విలక్షణ నటుడు స‌ముద్ర ఖ‌ని జీవించారు. మాస్టర్ ధృవన్, సముద్రఖని పోటీపడి నటించారు. సముద్రఖని నటనకు మ్యాచ్ చేస్తూ మాస్టర్ ధృవన్ నటించిన విధానం ఆకట్టుకుంటుంది. సముద్రఖని లేకుండా ఈ చిత్రాన్ని ఊహించుకోలేము అనేలా ఆయన నటించారు. ఇక అనసూయ వేశ్య పాత్రలో ఒదిగిపోయింది. చాలా సహజంగా నటించింది. రాహుల్ రామకృష్ణ, ఆటోడ్రైవర్ గా ధన్ రాజు తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు.

ప్లస్ పాయింట్స్:

సముద్రఖని నటన,
కథ ఎలివేషన్
ఎమోషనల్ సీన్స్
సంగీతం,

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్‌ స్లోగా సాగడం,
కొన్ని రొటిన్ సన్నివేశాలు,
ఊహించినట్టు ఉండే కథ, కథనాలు

రేటింగ్: 3/5

Previous articleబ్రూస్ లీ ట్రైనింగ్ ప్లాన్ ని ఎప్పుడైనా చూసారా..? వామ్మో ఇంత కఠినమా..?
Next articleTakkar Movie Review: టక్కర్ మూవీ రివ్యూ.. సిద్దార్ధ్ మూవీ హిట్టా..?, ఫట్టా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.