కన్నీళ్లు పెట్టిస్తున్న సిల్క్ స్మిత చివరి ఉత్తరం ! అందులో ఏమని రాసిందంటే ?

Ads

దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ గర్ల్ గా సంపాదించుకున్న నటి సిల్క్‌ స్మిత. హీరోయిన్లకు మంచి క్రేజ్ సంపాదించుకొని ఒక వెలుగు వెలిగిన ఈ తార అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించి నింగి తారలో కలిసిపోయింది.

సిల్క్ స్మిత ఆత్మహత్య టోటల్ సినీ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. అయితే ఆత్మహత్య సందర్భంగా సిల్క్ స్మిత రాసిన ఆఖరి ఉత్తరం ప్రస్తుతం నెట్లో వైరల్ గా మారింది.

వడ్లపట్ల విజయలక్ష్మి అలియాస్ సిల్క్‌ స్మిత ఒకప్పుడు ఆరేళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలాడి వరకు సులభంగా గుర్తుపట్టే పేరు. 1970 ప్రాంతంలో సౌత్ ఇండియన్ సినిమా అంటే సిల్క్ స్మిత పాట లేకుండా ఉండేది కాదు. తన కళ్లతోనే ప్రేక్షకులను ముంచి మైమరిపించే సిల్క్ స్మిత తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.

Queen of Sensuality Silk Smitha's Heart-breaking Suicide Note Goes Viral

15 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సిల్క్ స్మిత, అది సాఫీగా సాగకపోవడంతో ఎవరికి చెప్పకుండా మద్రాస్‌ కి పారిపోయింది. అక్కడ టచప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఆమెను గమనించిన మలయాళ దర్శకుడి కారణంగా ఇనయె తేడీ చిత్రం చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుతో ఎన్నో వైభోగాలు అనుభవించి ఆఖరికి అతిధీన స్థితిలో మృతి చెందింది.

Ads

10 Unknown Facts about the late actress Silk Smitha :::MissKyra

ఇంతకీ ఆమె రాసిన లేఖలో ఏముందంటే..”‘‘ఏడో ఏట నుంచి నేను పుట్టకూటికోసం కష్టాలు అనుభవించాను. నాది అంటే ఏమీ లేని జీవితాన్ని గడిపాను. నాకు నా బాబు తప్ప ఇంక ఎవరూ లేరు. రాము, రాధాకృష్ణ ఇద్దరు నన్ను మోసం చేశారు. దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. రోజు బాధను భరించాను ఇక ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు.”అని తన ఆవేదనను సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందు లేఖలో పొందుపరిచింది.

ఇందులో సిల్క్ స్మిత పేర్కొన్న రాధాకృష్ణ అనే వ్యక్తి ఆమె సెక్రటరీ. ఈ లేఖలో ఎక్కడ ఆత్మహత్య గురించి మెన్షన్ చేయనప్పటికీ పోలీసులు తమ విచారణ తర్వాత లేఖను ఆధారంగా చేసుకుని అది ఆత్మహత్య అని తేల్చేశారు. ఇప్పటికీ సిల్క్ స్మిత మృతి చెంది 26 సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంకా ఆమె కేసుపై పలు అనుమానాలు అలాగే మిగిలి ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఆమె సదానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మాత్రం జరిపిన తర్వాత అక్కడ సిబ్బంది అంత్యక్రియలు చేశారు. సౌత్ ఇండస్ట్రీ లో అగ్రతారగా వెలిగిన ఆమె ఆఖరికి అనాధగా మిగిలింది. అయితే కేవలం ఒక్క హీరో అర్జున్ మాత్రమే సిల్క్ స్మిత చనిపోయిన తర్వాత ఆమె డేడ్ బాడీ చూడడానికి వెళ్లాడు.

 

Previous articleపాకిస్తాన్ నుండి భారత్ కి తిరిగి వచ్చిన అంజు ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఏం చేస్తోంది..?
Next articleసుడిగాలి సుధీర్ నటించిన “కాలింగ్ సహస్ర” ఎలా ఉందంటే..?