సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఏఐ ఇండియన్ క్రికెటర్ల సన్యాసి అవతారాలు..

Ads

మార్కెట్లో ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుపెట్టింది. వచ్చిందో లేదో అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలు లాగా తెగ సందడి చేస్తుంది. ప్రజలు కూడా ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పలు రకాల కళాకృతులను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిన ఈ డిజిటల్ సృష్టి సరిహద్దులను రూపుమాపి ఎన్నడూ చూడని చిత్ర విచిత్రాలను కంటికి కట్టినట్టుగా చూపిస్తుంది.

మనం ఎలా కావాలనుకుంటే అలా ప్రతిరోజు సరికొత్త రీతిలో ఏదో ఒక వింతను సృష్టించి కలకలం రేపుతోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ముఖ్యంగా మిడ్ జర్నీ వంటి వినూత్నమైన ఆప్స్ సహాయంతో రూపొందించినటువంటి కొన్ని ఆన్లైన్ చిత్రాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ సరికొత్తగా సన్యాసుల వలె కనిపించే కొంత మంది ప్రముఖ ఇండియన్ క్రికెటర్ల ఫొటోస్ ను ఆవిష్కరించింది.ఎంతో మెలుకువ ఉన్న చిత్రకారుడు కొంచెం నుంచి జాలువారిన చిత్రపటాలు లాగా హావ భావాలు దగ్గర నుంచి ప్రతి కదలిక వరకు అచ్చు గుద్దినట్టు ఎంతో అందంగా ఉన్న ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా ధోని దగ్గర నుంచి గంగూలీ వరకు కొందరు ఫేమస్ క్రికెటర్స్ ను సన్యాసులుగా ఎలా ఉంటారో చూపిస్తున్న ఈ చిత్రాలు ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Ads

ఎప్పుడూ హడావిడిగా బ్యాట్ పట్టుకొని ఏదో ఒక మ్యాచ్లో హల్చల్ చేస్తూ తిరిగే మన క్రికెటర్స్ పూర్తి సన్యాసాన్ని స్వీకరిస్తే ఎలా కనిపిస్తారు అని ఆసక్తి ఉన్నవారు ఈ ఏఐ కళాకారుడు సృష్టించిన ఫొటోస్ చూసి సంతృప్తి పొందవచ్చు. సాంకేతికతతో పాటు కళాత్మకత కూడా కలిసిన అద్భుతమైన సమ్మేళనం ఈ చిత్రాలు అని చెప్పవచ్చు.వైల్డ్ ట్రాన్స్ అనే ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ నేమ్ తో ఉన్నటువంటి ఒక ఏఐ ఆర్టిస్ట్, తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఈ అద్భుతమైన చిత్రాలను షేర్ చేసుకున్నారు. దీనికోసం ఇతను ప్రముఖ ఏ ఐ టూల్ మిడ్ జర్నీని ఉపయోగించాడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫొటోస్ షేర్ అయినా అతి కొద్ది సమయంలోనే ఇంటర్నెట్లో హల్చల్ సృష్టిస్తున్నాయి. మరి మన టాప్ క్రికెటర్ సన్యాసులుగా ఎలా ఉంటారో మీరు కూడా ఒక లుక్ వేయండి..

MS ధోని

కపిల్ దేవ్

విరాట్ కోహ్ల

సచిన్ టెండూల్కర్

రోహిత్ శర్మ

హార్దిక్ పాండ్యా

హర్భజన్ సింగ్

యువరాజ్ సింగ్

వీరేంద్ర సెహ్వాగ్

సౌరవ్ గంగూలీ

AI artist shared these images with a caption as we quote,

Previous articleభరత్ అనే నేను మూవీ లో శుభోదయం సుబ్బారావు ఎవరో మీకు తెలుసా?
Next articleక్రికెట్ లో రెడ్ కార్డుని ఎందుకు ఇస్తారు..? ఏ ఆటగాడికి ఇచ్చారో మీకు తెలుసా..? (Video)