భరత్ అనే నేను మూవీ లో శుభోదయం సుబ్బారావు ఎవరో మీకు తెలుసా?

Ads

మహేష్ మరియు కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. మరి ముఖ్యంగా భరత్ అనే నేను మహేష్ బాబు ను ఒక ఆదర్శవంతమైన యంగ్ సిఎం గా చూపించింది. ఒక యువకుడు సీఎం అయితే ఎటువంటి బాధ్యతలు కష్టాలు ఎదుర్కొంటాడు అనేది ఎంతో అద్భుతంగా వివరించారు.

ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి చిన్న పాత్రలే చిత్రాన్ని ఊహించని మలుపు తిప్పుతాయి. అలాంటి పాత్రే ఈ చిత్రంలోని శుభోదయం అనే పత్రిక విలేకరి పాత్రలో కనిపించిన సుబ్బారావు. కాస్త ఏజ్ బార్ గా కనిపించే ఈ శుభోదయం సుబ్బారావు మొదట్లో మహేష్ కు కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతాడు.2018 లో విడుదలైన ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ నటించారు.
ఈ చిత్రంలో మరీ ముఖ్యంగా మహేష్ బాబును ఇంటర్వ్యూ చేస్తూ ప్రతి రాజకీయ నాయకుడు అలాగే ఉంటాడని వ్యంగ్యంగా మాట్లాడే విలేకరి పాత్ర శుభోదయం సుబ్బారావు. ఇందులో శుభోదయం సుబ్బారావు గా నటించిన వ్యక్తి పేరు రాజశేఖర్. అతను ఇంతకుముందు ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ భరత్ అనే నేను చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది.

Ads

ఇతని పూర్తి పేరు రాజశేఖర్ అంగోని.2014లో షురుయాత్ యాత్ ఇంటర్వెల్ అనే చిత్రంతో ఇతను ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. గోవిందుడు అందరివాడేలే ,బాహుబలి ద బిగినింగ్, అరవింద సమేత వీర రాఘవ లాంటి పలు చిత్రాలలో అతను చిన్న పాత్రలో నటించారు. అయితే మహేష్ బాబు మూవీ తర్వాత అతన్ని అందరూ శుభోదయం సుబ్బారావు గానే గుర్తిస్తున్నారు. చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ జనాలకు బాగా కనెక్ట్ అయిపోవడంతో అతనికి ఆ పేరు ఫిక్స్ అయిపోయింది.

Previous articleఆ మూవీ కోసం రెమ్యూనరేషన్ వద్దనుకున్న చిరు…అసలు మ్యాటర్ అదేనట…
Next articleసోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఏఐ ఇండియన్ క్రికెటర్ల సన్యాసి అవతారాలు..