Ads
2023 ఆసియా కప్ టీం ఇండియా జట్టును ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఎప్పటిలాగా టీం రోహిత్ శర్మ నేతృత్వంలో, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీలో ముందుకు నడవండి.
ఇక ఎప్పటిలాగానే ఓపెనింగ్ జోడిగా హిట్మ్యాన్, శుభ్మాన్ గిల్ ఉన్నారు. ఢిల్లీలో సోమవారం నాడు సమావేశమైన కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడ్ మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ 17 మంది సభ్యులతో కూడినటువంటి టీం ఇండియా జట్టును ప్రకటించడం జరిగింది.
అయితే ఆసియా కప్ సెలెక్ట్ చేసిన టీమ్ లో శిఖర్ ధావన్ పేరు ఎక్కడా లేదు. రికార్డులు ఒక్కసారి తిరగవేస్తే ఇంతకుముందు జరిగిన ఆసియా కప్ లో శిఖర్ ధావన్ ఏ స్థాయి ఆటగాడు అందరికీ అర్థమవుతుంది. అతను పర్ఫార్మ్ చేసిన స్థాయిలో మరి ఇంకెవరూ చేయలేరు. 2018 ఈ టోర్నమెంట్లో 9 మ్యాచులు ఆడిన ధావన్ రెండు సెంచరీలు రెండు అర్థ సెంచరీలు తో 534 పరుగులు సాధించాడు.
Ads
ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్న దావన్న పక్కన పెట్టి సరిగ్గా ఫిట్నెస్ కూడా సాధించని రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లకు…వన్డే సిరీస్ సరిగ్గా ఆడడం చేతకాని సూర్య లాంటి ఆటగాళ్లను ఎందుకు బిసిసిఐ సెలెక్ట్ చేస్తోందో అర్థం కావడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అయితే మరోపక్క ధావన్ గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం అతని వన్డే కెరియర్ ని పెద్ద ప్రశ్నార్ధకంగా మార్చింది. ఓపెన్ అరుగా ధావన్ టీమిండియా కు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను అందించాడు. అయితే ప్రస్తుతం ప్రెఫెర్డ్ ఓపెనర్లురో హిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్మాన్ గిల్ మాత్రమేనని అన్న అజిత్ అగర్కర్ మాటలు ధావన్ కు ఇకపై టీమిండియా తలుపులు తెరుచుకోవేమో అన్న సందేహాన్ని రేపుతున్నాయి.
ఫైనల్ టీం వివరాలు….
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.