సినిమా విడుదలకు వారం కూడా లేదు… ఈ టైమ్‌లో సమంత ఎందుకు ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారు..?

Ads

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వస్తున్న రొమాంటిక్ చిత్రాలు ఖుషి. ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు శివ నిర్వాణ వహిస్తున్నారు. మంచి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం విడుదలకు ముందే ప్రమోషన్స్ అంటూ పెద్దగా హడావిడి చేస్తున్నారు.

ఏ మూవీ నుంచి విడుదలైన పాటలు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.మొన్న ఆగస్టు 15 సాయంత్రం జరిగిన ఖుషి మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంలో సమంత,విజయ్ దేవరకొండ స్టేజి పై ఏ రేంజ్ లో రెచ్చిపోయారు అందరూ చూశారు. తన అనారోగ్య సమస్య కారణంగా బ్రేక్ తీసుకున్న సమంత ప్రమోషన్ లో భాగంగా మ్యూజికల్ నైట్ లో పాల్గొన్నారు. అయితే ప్రోగ్రాం పూర్తయిన వెంటనే తన తల్లితో కలిసి తిరిగి అమెరికాకు వెళ్ళిపోయింది.

Ads

why did samantha not attending kushi promotions

సినిమా విడుదల అవడానికి గట్టిగా పది రోజుల సమయం కూడా లేదు. ఈ పది రోజుల్లో ప్రమోషన్స్ బాగా జరిగితేనే చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది. అయితే సామ్ అమెరికాకు వెళ్లడంతో ఇక ప్రమోషన్స్ లో పాల్గొనదు అని కచ్చితంగా అర్థమవుతుంది. అయితే సమంత అమెరికాకి వెళ్తున్నది హాలిడే కోసం కాదట…ఆగస్టు 20 న న్యూయార్క్ లో జరగనున్న భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం కోసం సమంత వెళ్ళినట్లు తెలుస్తోంది.

why did samantha not attending kushi promotions

సమంతతో పాటుగా ఈ వేడుకలలో రవి కిషన్, జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌లకు ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. వేడుకలు పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులు సమంత అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే సమంత అక్కడే ఉంటారా లేక తిరిగి వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంటారా…. అన్న విషయం పై ఎవరికీ స్పష్టత అయితే లేదు.

Previous articleచిరంజీవి బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్న 10 ఎడిటడ్ వీడియోస్..ఫాన్స్ కి పూనకాలే..!!!
Next articleఆసియా కప్‌లో అతనికి చోటు దక్కలేదు… కాపాడడానికి ధోనీ కూడా లేడు.! ఇక రిటైర్ అవ్వాల్సిందేనా.?