Ads
చాలా మంది ప్రతీ ఏటా మానకుండా సత్య నారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. కొందరైతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. అంటే ఇల్లు కట్టిన, పెళ్లి రోజు లేదా ముఖ్యమైన రోజులప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. కొత్త ఇల్లు గృహప్రవేశం అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం తప్పక చెయ్యాలి.
అలానే పెళ్లయిన తర్వాత కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయడం తరతరాల నుండి చూస్తున్నాము. ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా..?
ఎందుకు కొత్తగా పెళ్లయిన జంట చేత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయిస్తారు అని.. పెళ్లయిన తర్వాత కోడల్ని అత్త వారింటికి తీసుకెళ్లి ఆ తర్వాత కోడలు చేత కొడుకు చేత వ్రతం చేయిస్తారు. తర్వాత మళ్ళీ పుట్టింటికి భార్యా భర్తలను తీసుకు వస్తారు. వివాహం తర్వాత ఏ ఇబ్బందులు భార్య భర్తలకి కలగకూడదని, ఎలాంటి సమస్యలు రాకూడదని, ఒడిదుడుకులు ఏమీ లేకుండా కలహాలు రాకుండా నూతన వధూవరులు ఆనందంగా ఉండాలని సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం వలన ఏ ఒడిదుడుకులు లేకుండా భార్యాభర్తలు ఆనందంగా ఉండేందుకు సత్యనారాయణ స్వామి వారు కాపాడతారని హిందువులు నమ్మకం.
Ads
సత్యనారాయణ స్వామి భక్త సులభుడు. అయితే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన సామాగ్రిని కొనడానికి, ఆనందంగా జీవితాన్ని గడపడానికి సత్యనారాయణ స్వామి అనుగ్రహం తప్పక ఉండాలి. ఈ వ్రతం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. అందుకనే పెళ్లయిన తర్వాత సమస్యలు ఏమి ఉండకూడదని వధూవరులు ఆనందంగా ఉండాలని ఈ వ్రతాన్ని చేయిస్తారు. ఈ వ్రతం చేసిన రోజు అందరినీ పిలుస్తారు. పైగా అందరూ రావడం వలన కోడల్ని చూస్తారు. కోడల్ని పరిచయం చేసినట్టు కూడా అవుతుంది కోడలు కూడా అందరితో కలవడానికి ఒక అవకాశం వస్తుంది.