VYOOHAM REVIEW : రామ్ గోపాల్ వర్మ “వ్యూహం” స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం : వ్యూహం
  • నటీనటులు : అజ్మల్ అమీర్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, మానస రాధాకృష్ణన్.
  • నిర్మాత : దాసరి కిరణ్ కుమార్
  • దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
  • సంగీతం : బాలాజీ
  • విడుదల తేదీ : మార్చి 2, 2024

vyooham movie review

స్టోరీ :

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన సీన్ తో సినిమా మొదలవుతుంది. అయితే, సినిమాలో అందరి పేర్లు మార్చారు. వీర శేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని, మదన్ రెడ్డి, వైయస్ భారతి గారిని మాలతి, సోనియా గాంధీని మేడం, బాబు గారు, ముఖేష్, జనసేన పార్టీ పేరుని మనసేన, శ్రవణ్ కళ్యాణ్ పేర్లతో సినిమాలో పాత్రలని చూపించారు. తండ్రి చనిపోయాక మదన్ రెడ్డి (అజ్మల్ అమీర్) ఏం చేశారు? ఆయన ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ సినిమాలో చూపించారు.

vyooham movie review

రివ్యూ :

వైయస్ఆర్ గారి మరణం తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ కూడా సినిమాలో చూపించారు. కానీ సినిమాలో నటించిన వాళ్ల పాత్రల పేర్లు మాత్రం మార్చారు. కానీ వారు వేసుకునే దుస్తుల స్టైల్ ని బట్టి వాళ్ళు ఎవరు అనేది మనకి అర్థం అయ్యేలాగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. ఈ సినిమా నిజ జీవితంలో ఉన్న వ్యక్తుల ఆధారం చేసుకుని రూపొందించిన సినిమా. అందుకే ఈ సినిమాలో పాత్రలు ప్రవర్తించే తీరు అంతా కూడా, ఆ నిజ జీవితంలో ఉన్న వ్యక్తులకి దగ్గరగా ఉండేలాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించారు.

Ads

vyooham movie review

కాబట్టి ఆ పాత్రల్లో ఆ నటీనటులు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. డైలాగ్ డెలివరీ, వాయిస్ మోడ్యులేషన్ విషయంలో కూడా తీసుకున్న జాగ్రత్తలు సినిమాలో ఆ పాత్రలు ఎవరు అనేది తెలియజేసేలాగా ఉన్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ చాలా బాగా నటించారు. సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా ఉండే సీన్స్ చాలా ఉన్నాయి. వాటిని తెర మీద చూపించిన విధానం బాగుంది. నేపథ్య సంగీతం విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. కానీ సినిమా అంతటా కూడా కంటెంట్ పరంగా బలంగా ఉండేలాగా చూసుకున్నారు.

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

వైయస్సార్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. జగన్మోహన్ రెడ్డి ఎలా ముందడుగు వేశారు అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇందులో భాగంగా వచ్చే చాలా సీన్స్ ఎమోషనల్ గా ఉన్నాయి. ఇది ఒక మంచి పొలిటికల్ డ్రామా.

watch trailer :

ALSO READ : ఈ హీరో బర్త్ డే నాలుగేళ్లకు ఒకసారే…ఫిబ్రవరి 29 న పుట్టిన ఏకైక టాలీవుడ్ హీరో ఇతనే.!

Previous articleఈ హీరో బర్త్ డే నాలుగేళ్లకు ఒకసారే…ఫిబ్రవరి 29 న పుట్టిన ఏకైక టాలీవుడ్ హీరో ఇతనే.!
Next articleకొత్తగా పెళ్ళైన భార్యా భర్తతో “సత్యనారాయణ వ్రతం” ఎందుకు చేయిస్తారు…?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.